40కి చేరువవుతున్నా హాట్‌నెస్‌తో హీటెక్కిస్తున్న కత్రినా!

కత్రినా కైఫ్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2004లో వెంక‌టేష్ హీరోగా వ‌చ్చిన `మ‌ల్లీశ్వ‌రి` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన క‌త్రినా.. ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో చేసిన‌ మైనే ప్యార్ క్యూ కియా, నమస్తే లండన్ వంటి సినిమాలు సూప‌ర్ హిట్‌గా నిలిచాయి. దీంతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

 

 

తెలుగులో మ‌ల్లీశ్వ‌రి త‌ర్వాత బాల‌య్య హీరోగా వ‌చ్చిన `అల్లరి పిడుగు` చిత్రంలో న‌టించింది. ఆ త‌ర్వాత తెలుగులో మ‌రే సినిమా చేయ‌లేదు. అయితే బాలీవుడ్ మాత్రం వ‌రుస అవ‌కాశాలు అంద‌రూ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ఎంత మంది స్టార్ హీరోయిన్స్ వస్తున్నా, వయసు 40కి చేరువ‌వుతున్నా ఈమె క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు.

 

 

మ‌రోవైపు అందం విష‌యంలోనూ ఆమెకు ఆమే సాటి. మేకప్ ఉన్నా లేకున్నా అందంగా కనిపించే బాలీవుడ్ తారలలో ఒక‌రైన‌ కత్రినా.. తాజాగా షేర్ చేసిన ఫొటో ప్ర‌స్తుతం కుర్ర‌కారుకు చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. డార్క్ ఫోటోగ్రఫీలో థై సొగసుల్ని ఎలివేట్ చేస్తూ కత్రినా ఇచ్చిన ఫోజు అద్భుతంగా ఉంద‌ని చెప్పాలి. ఈ ఫొటో చూస్తేంటే.. 37 ఏళ్ల వ‌య‌సులోనూ ఈ సీనియ‌ర్ బ్యూటీ హాట్‌నెస్‌తో హీటెక్కిస్తుంది అన‌డంలో సందేహ‌మే లేదు.