వామ్మో… వ‌కీల్‌సాబ్‌కు అన్ని కోట్లు ఖ‌ర్చ‌య్యిందా…!

అజ్ఞాత‌వాసి సినిమా త‌ర్వాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న వ‌కీల్‌సాబ్ సినిమా షూటింగ్ గ‌త యేడాది కాలంగా జ‌రుగుతూనే ఉంది. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్‌గా వ‌కీల్‌సాబ్ తెర‌కెక్కుతోంది. వ‌చ్చే సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి తేవాల‌ని నిర్మాత దిల్ రాజు ఆశ‌ల‌తో ఉన్నాడు. ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్‌కు సైతం ఈ సినిమాలో వాటా ఉంది. ఎంతో త‌క్కువ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను లాగేయాల‌ని రాజు ముందు నుంచి ప్లాన్‌తో ఉన్నాడు.

 

అయితే క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల షూటింగులు వాయిదా ప‌డ‌డంతో పాటు వ‌డ్డీలు అన్ని క‌లిపి మొత్తం రు. 80 కోట్లు బ‌డ్జెట్ అయ్యింద‌ట‌. అయితే ఇప్పుడు అంత బ‌డ్జెట్ రిక‌వ‌రీ చేస్తుందా ? అన్న సందేహం నిర్మాత దిల్ రాజును వేధిస్తోంద‌ట‌. ఈ బ‌డ్జెట్ మొత్తంలో స‌గం ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్ కిందే ఖ‌ర్చ‌య్యింది. అయితే ఇంకా వ‌డ్డీలు పెరుగుతుండ‌డంతో నిర్మాత రాజు ఎంత త్వ‌ర‌గా వీలుంటే అంత త్వ‌ర‌గా సినిమాను రిలీజ్ చేయాల‌ని చూస్తున్నా థియేట‌ర్ల‌కు జ‌నాలు వ‌చ్చేంత ఆస‌క్తితో అయితే లేరు.

 

దీంతో రాజులో రోజు రోజుకు టెన్ష‌న్ మ‌రింత ఎక్కువ‌వుతోంద‌ట‌. అయితే ప‌వ‌న్ రీ ఎంట్రీ సినిమా కావ‌డంతో ఫ్యాన్స్ ఎంతో ఆశ‌తో ఉన్నారు. పైగా లాక్‌డౌన్ త‌ర్వాత వ‌స్తోన్న పెద్ద సినిమా ఇదే. ఈ అంశాలే వ‌కీల్‌సాబ్‌ను బ్లాక్ బ‌స్ట‌ర్ చేస్తాయ‌ని అంద‌రూ ఆశ‌తో ఉన్నారు. మ‌రి ప‌వ‌న్ ఏం చేస్తాడో ?  చూడాలి.