Moviesటాలీవుడ్‌కు కేసీఆర్ గుడ్ న్యూస్‌... వాళ్ల‌కు పండ‌గే..

టాలీవుడ్‌కు కేసీఆర్ గుడ్ న్యూస్‌… వాళ్ల‌కు పండ‌గే..

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ టాలీవుడ్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. కోవిడ్ వ‌ల్ల గ‌త ఏడెనిమిది నెల‌లుగా ప‌లు సినిమాల షూటింగ్‌లు ఆగిపోయాయి. దీంతో ప‌రిశ్ర‌మ‌కు కొన్ని కోట్ల న‌ష్టం వాటిల్లింది. దీనికి తోడు ఎంతో మంది కార్మికులు జీవ‌నోపాధి లేక నానా ఇబ్బందులు ప‌డ్డారు.. ఇంకా ప‌డుతున్నారు. ఎప్పుడు షూటింగ్‌లు ప్రారంభ‌మ‌వుతాయా ? అని వారంతా ఆశ‌తో ఉన్నారు. అటు థియేట‌ర్లు ప్రారంభంకాక ఎంతో మంది న‌ష్ట‌పోయారు. ఈ క్ర‌మంలోనే న‌ష్ట‌పోయిన తెలుగు సినీ పరిశ్ర‌మ‌ను ఆదుకునేందుకు అనేక రాయితీలు ఇస్తామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు.

న‌ష్ట‌పోయిన ప‌రిశ్ర‌మ‌ను ఆదుకునేందుకు ఇవ్వాల్సిన రాయితీలు, మిన‌హాయింపులు ఇస్తామ‌ని ఆయ‌న తెలిపారు. ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు పెద్ద‌లు ఆదివారం కేసీఆర్‌ను ప్ర‌గ‌తి భ‌వ‌న్లో క‌లిశారు. కోవిడ్ వ‌ల్ల ఇండ‌స్ట్రీకి జ‌రిగిన న‌ష్టాన్ని వివ‌రించారు. దేశంలో ముంబై, చెన్నై త‌ర్వాత అతిపెద్ద సినీ ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్‌లోనే ఉంద‌ని.. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్య‌త మాపై ఉంద‌ని ఆయ‌న అన్నారు.

ఇక గ్రేట‌ర్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీఆర్ఎస్ విడుద‌ల చేసే మేనిఫెస్టోలో సినిమా ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన అంశాల‌ను అన్నింటిని ప్ర‌స్తావిస్తామ‌ని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శితో పాటు ప్ర‌ముఖ హీరోలు చిరంజీవి, నాగార్జున కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news