నంద‌మూరి సినిమాలో యంగ్ ఎమ్మెల్యేగా నారా హీరో… ట్విస్ట్ ఇదే…!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఫ‌స్ట్ రోరింగ్ ఇప్ప‌టికే రిలీజ్ అయ్యి మాస్ ఫ్యాన్స్‌కు కావాల్సినంత విందు చేస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ల వేట‌లో బోయ‌పాటి ఉన్నాడు. ఈ  సినిమా గురించి ఓఅదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చింది. ఈ నంద‌మూరి హీరో సినిమాలో నారా హీరో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. రోహిత్ ఓ యంగ్ ఎమ్మెల్యేగా క‌నిపిస్తాడ‌ట‌. ఈ పాత్ర కాస్త నెగిటివ్ షేడ్స్‌లో ఉంటుంద‌ని కూడా తెలుస్తోంది.

 

రోహిత్ ఎంట్రీతో ఈ సినిమాలో సూప‌ర్ ట్విస్టులు ఉంటాయ‌ని తెలుస్తోంది. ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను కూడా ప‌రిచ‌యం చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాను మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రు. 40 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్క‌నుందంటున్నారు. బాల‌య్య‌కు లెజెండ్‌, సింహా లాంటి రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు ఇచ్చిన బోయ‌పాటి ఈ సినిమాతో బాల‌య్య‌కు హ్యాట్రిక్ హిట్ ఇస్తాడ‌న్న అంచ‌నాలు బ‌లంగా ఉన్నాయి.

ఎస్‌.ఎస్‌. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఇక తెలుగు ప్రేక్ష‌కుల్లో వైవిధ్య‌మైన క్యారెక్ట‌ర్ల‌తో ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన నారా రోహిత్ యంగ్ ఎమ్మెల్యేగా నెగిటివ్ షేడ్‌లో బాల‌య్య‌ను ఎలా ఢీ కొడ‌తాడో ?  చూడాలి.