గుంటూరులో శాడిస్ట్ భ‌ర్త‌… డబ్బు కోసం భార్య శృంగార వీడియోలు యూట్యూబ్‌లోకి…!

గుంటూరులో డ‌బ్బు కోసం ఓ శాడిస్ట్ భ‌ర్త భార్య‌తో శృంగారం చేసిన వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయ‌డం మొద‌లు పెట్టాడు. చివ‌ర‌కు భర్త దారుణాన్ని గ‌మ‌నించిన భార్య పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. గుంటూరు ఏటీ అగ్ర‌హారానికి చెందిన ఓ శాడిస్ట్ భ‌ర్త త‌న భ‌ర్త వికృత చేష్ట‌ల‌కు భ‌య‌ప‌డిపోయింది. ఇంట్లో కూర్చొని ఏ ప‌ని చేయ‌కుండా డ‌బ్బు సంపాదించాల‌ని ప్లాన్ వేశాడు. ఇందుకు త‌న భార్య‌తో శృంగారం చేస్తోన్న‌ప్పుడు ఆమెకు తెలియ‌కుండానే వీడియోలు తీసి వాటిని యూట్యూబ్‌లో పెడుతున్నాడు.

చివ‌ర‌కు యూట్యూబ్‌లో త‌న భ‌ర్త‌, త‌న శృంగార వీడియోలు చూసి నిర్ఘాంత పోయిన భార్య వెంట‌నే పోలీస్ ఉన్నతాధికారుల‌ను క‌లిసి ఫిర్యాదు చేయ‌గా వారు వెంట‌నే ఈ కేసును దిశ పోలీస్ స్టేష‌న్‌కు బ‌దిలీ చేశారు. పోలీసులు వాటిని కేవ‌లం యూట్యూబ్‌లో మాత్ర‌మే పోస్ట్ చేశాడా ?  లేదా ఇత‌ర పోర్న్ సైట్ల‌కు కూడా పంపాడా ? అన్న కోణంలో విచార‌ణ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం గుంటూరు న‌గ‌రంలో పెద్ద హాట్ టాపిక్‌గా మార‌డంతో పోలీసులు దీనిని సీరియ‌స్‌గా తీసుకుని విచారిస్తున్నారు.