సినిమాల్లోకి స్టార్ హీరో భార్య రీ ఎంట్రీ… ఈమెను గుర్తు ప‌ట్టారా..!

కన్నడ స్టార్ హీరో విలక్షణ నటుడు ఉపేంద్ర గురించి తెలియని వారు ఉండ‌రు. ఉపేంద్ర క‌న్న‌డ న‌టుడు అయినా ద‌క్షిణాదిలో అన్ని భాష‌ల్లోనూ ఉపేంద్ర‌కు అభిమానులు ఉన్నారు. రెండు ద‌శాబ్దాల క్రితం ఉపేంద్ర సినిమా వ‌స్తుందంటే సౌత్ సినీ అభిమానులు చచ్చిపోయేవారు. ఇక స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలో న‌టించిన ఉపేంద్ర తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల‌ను మ‌రోసారి గెలుచుకున్నాడు.

 

ఉపేంద్ర త‌న‌తో పాటు హీరోయిన్‌గా న‌టించిన హీరోయిన్ ప్రియాంక‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక ప్రియాంక సినిమాలకు దూరమైంది. ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోన్న ప్రియాంక ఇప్పుడు చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రియాంక తాజాగా ఉగ్రావ‌తార సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వ‌నుంది. ఇక కొత్త సినిమాల‌ను కూడా ఆమె ఓకే చేస్తోంది. తాజాగా ఆమె లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకు సైతం సైన్ చేశారు.

 

అలాగే థ్రిల్ల‌ర్ మూవీ 1980లో కూడా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఆమె చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. ఏదేమైనా ప్రియాంక రీ ఎంట్రీతో వ‌రుస సినిమాల‌తో హైలెట్ అవుతోంది.