తెలంగాణ‌లో మ‌రో ప్ర‌ణ‌య్ హ‌త్య‌‌… కూతురును ప్రేమిస్తున్నాడ‌ని..!

ఇటీవ‌ల తెలంగాణ‌లో ప్రేమ హ‌త్య‌లు, ప‌రువు హ‌త్య‌లు, ప్రేమోన్మాదుల దురాగ‌తాలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా మిర్యాల‌గూడలో అమృత‌ను పెళ్లి చేసుకున్నాక ప్ర‌ణ‌య్ హ‌త్య జ‌రిగాక ఇదే త‌ర‌హాలో మూడు నాలుగు హ‌త్య‌లు జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ ప్రేమ‌ల్లో అమ్మాయిల ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉంది. ప్రేమించ‌క‌పోతే అటు అబ్బాయిల నుంచి వేధింపులు,, ప్రేమిస్తే ఇంట్లో వాళ్ల నుంచి వేధింపులు అన్న‌ట్టుగా వాళ్ల ప‌రిస్థితి ఉంది.

 

తాజాగా క‌రీంన‌గ‌ర్ జిల్లా వీణ‌వంక మండలం పోతిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది. ప్ర‌ణ‌య్ అనే యువ‌కుడిని గొడ్డ‌ళ్ల‌తో న‌రికి చంపేశారు. అత‌డి వ‌య‌స్సు 22 సంవ‌త్స‌స‌రాలు. అయితే అత‌డు అదే గ్రామానికి చెందిన ఓ యువ‌తిని ప్రేమిస్తున్నాడు. తాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాన‌ని ఆమె త‌ల్లిదండ్రుల‌తో కూడా ఇటీవ‌ల మాట్లాడిన‌ట్టు చెపుతున్నారు.

 

త‌మ కుమార్తెను ప్ర‌ణ‌య్ పెళ్లి చేసుకోవ‌డం ఇష్టం లేని  ఆమె కుటుంబ స‌భ్యులే ప్ర‌ణ‌య్‌ను చంపించి ఉంటార‌న్న అనుమానాలు గ్రామ‌స్తులు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సంఘ‌ట‌న ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది.