ఫేస్‌బుక్ ప్రియుడి మోజులో ఆ యువ‌తి భ‌ర్త‌ను ఏం చేసిందంటే..

సోషల్ మీడియా ప‌రిచ‌యాల‌తో ఎన్నో సంసారాలు నాశ‌న‌మ‌వుతున్నాయి. సోష‌ల్ మీడియాలో ప‌రిచ‌యం అయితే యువ‌తీ, యువ‌కులు అక్ర‌మ సంబంధాలు పెట్టుకుని బంగారం లాంటి కాపురాలు నాశ‌నం చేసుకుంటున్నారు. తాజాగా హైద‌రాబాద్‌కు చెందిన గౌసియా అనే యువ‌తి ఫేస్‌బుక్‌తో ప‌రిచ‌యం అయిన వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది. ఈ విష‌యం తెలిసిన భ‌ర్త నాస‌ర్‌ ( ప్రేమించి మ‌రీ పెళ్లి చేసుకుంది) ఆ సంబంధం వ‌దులుకోవాల‌ని చెప్పినా విన‌కుండా భ‌ర్త‌నే చంపేసింది.

 

చాంద్రాయ‌ణ గుట్ట ఇందిరాన‌గ‌ర్‌లో ఉండే నాస‌ర్‌ అదే ప్రాంతానికి చెందిన గౌసియా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు కొడుకులు. ఆ భార్య‌కు కొన్నాళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో ప‌హాడీ ష‌రీఫ్‌కు చెందిన వ్య‌క్తితో ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్తా వివాహేత‌ర సంబంధానికి దారితీసింది. ఈ విష‌యం తెలిసిన భ‌ర్త ఆమెను ప‌ద్ద‌తి మార్చుకోవాల‌ని హెచ్చ‌రించినా ఆమె తీరు మాత్రం మార్చుకోలేదు. ఈ క్ర‌మంలోనే ఈ నెల 17న భ‌ర్త ఇంట్లో ప‌డుకున్నాక ఆమె ప్రియుడికి ఫోన్ చేసింది.

 

త‌ర్వాత వారిద్ద‌రు క‌లిసి ఆమె భ‌ర్త మొఖంపై దిండు ఉంచి ఊపిరి ఆడ‌కుండా చేసి హత మార్చారు. ఆ తర్వాత గౌసియా అత్తగారింటికి వెళ్లి గుర్తు తెలియని వ్యక్తి భర్త గొంతు నులిమాడ‌ని చెప్ప‌గా వారు వ‌చ్చి నాస‌ర్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతి చెందాడ‌ని చెప్పారు. చివ‌ర‌కు పోలీసుల విచార‌ణ‌లో గౌసియా, ఆమె ప్రియుడే నాస‌ర్‌ను చంపిన‌ట్టు తేలింది.