Moviesహైద‌రాబాద్‌లో టాలీవుడ్ నిర్మాత కిడ్నాప్‌.. అచ్చు సినిమా స్టైల్లోనే..

హైద‌రాబాద్‌లో టాలీవుడ్ నిర్మాత కిడ్నాప్‌.. అచ్చు సినిమా స్టైల్లోనే..

హైద‌రాబాద్‌లో క‌డ‌ప గ్యాంగ్ ర‌చ్చ చేసింది. అచ్చం సినిమా స్టైల్లో చూపించిన‌ట్టుగా ఓ నిర్మాత‌ను కిడ్నాప్ చేసింది. సినిమా స్టైల్లో కార్ ఆగ‌డం, మ‌నిషిని లాక్కుని కార్‌లో ఎక్కించుకోవ‌డం ఆ వెంట‌నే అక్క‌డ నుంచి మాయం కావ‌డం అంతా క్ష‌ణాల్లో జ‌రిగిపోయింది. బంజారాహిల్స్‌లో సినీ స్టైల్లో జ‌రిగిన ఈ కిడ్నాప్ ఇప్పుడు టాలీవుడ్‌లో క‌ల‌క‌లం రేపుతోంది. హైద‌రాబాద్ న‌డిబొడ్డున మాజీ ఎమ్మెల్యే వ‌ర‌ద‌రాజుల రెడ్డి కొడుకు కొండా రెడ్డి నానా ర‌చ్చ ర‌చ్చ చేశారు.

Kidnap for ransom: To pay or not to pay? | OSCE

సినిమా నిర్మాత, డిస్ట్రిబ్యూట‌ర్ శివ‌గ‌ణేష్‌ను కొండా రెడ్డి అత‌డి అనుచ‌రులు సినీ ప‌క్కీలో కిడ్నాప్ చేసి క్ష‌ణంలో మాయం అయ్యింది. రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని శామీర్‌పేట‌తో పాటు క‌డ‌ప జిల్లాకు సంబంధించిన భూముల ప‌త్రాల కోస‌మే ఈ కిడ్నాప్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ప‌క్క‌నే ఉన్న ప్ర‌త్య‌క్ష సాక్షులు చెపుతోన్న దాని ప్ర‌కారం కొండా రెడ్డితో పాటు కొంద‌రు అనుచ‌రులు తుపాకులు, క‌త్తులు చూపించి మ‌రీ శివ‌గణేష్‌ను కిడ్నాప్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

tollywood logo - Telugu Journalist

ఈ కిడ్నాప్ గ్యాంగ్ శివ‌గ‌ణేష్‌ను వ‌దిలేశాక అత‌డు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. విచార‌ణ‌లో ఈ కేసుకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news