Gossipsఐశ్వ‌ర్యారాయ్ పెళ్లికి క‌ట్టుకున్న చీర రేటు తెలిస్తే మైండ్ బ్లాకేగా... !

ఐశ్వ‌ర్యారాయ్ పెళ్లికి క‌ట్టుకున్న చీర రేటు తెలిస్తే మైండ్ బ్లాకేగా… !

ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ భార‌తీయ సినీ అభిమానుల మ‌న‌స్సుల‌ను గ‌త మూడు ద‌శాబ్దాలుగా దోచుకుంటూనే ఉంది. 1994లో ప్ర‌పంచ సుంద‌రి అయిన ఐశ్వ‌ర్య ఎన్నో బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్ సినిమాల్లో న‌టించి భార‌త సినీ అభిమానుల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వేసింది. 2007లో అమితాబ్ కుమారుడు అభిషేక్ బ‌చ్చ‌న్‌ను పెళ్లాడిన ఐశ్వ‌ర్య పెళ్ల‌య్యాక కూడా కొన్ని సినిమాల్లో న‌టించినా త‌ర్వాత త‌న పాపా ఆరాధ్య కోసం సినిమాల‌కు దూర‌మైంది.

Aishwarya Rai-Abhishek Bachchan 13th Wedding Anniversary: From invitation  card to saath phere; lesser seen moments

ఐశ్వ‌ర్య పెళ్ల‌య్యాక కూడా మ‌న సౌత్‌లో ర‌జ‌నీ కాంత్ ప‌క్క‌న రోబో లాంటి సినిమాల్లో నటించి త‌న అంద చందాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఇక ఐశ్వ‌ర్యారాయ్ గురించి ఏ చిన్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చినా చాలా ఆస‌క్తిగానే ఉంటుంది. ఆమె 2007లో అభిషేక్‌ను పెళ్లి చేసుకున్న‌ప్పుడు పెళ్లికూతురుగా ముస్తాబు అయిన స‌మ‌యంలో ఆమె వేసుకున్న చీర ఖ‌రీదు ఏకంగా రు. 75 ల‌క్ష‌ల‌ట‌.

Unseen Video Of Abhishek Bachchan And Aishwarya Rai's Wedding In 2007,  Glimpse Of The Varmala Ritual

ఆ చీర‌ను బంగారు దారాల‌తో డిజైన్ చేయించార‌ట‌. ఆ చీర‌కు త‌గ్గ‌ట్టుగానే బంగారు న‌గ‌ల‌ను కూడా డిజైన్ చేయించార‌ట‌. అప్పట్లో పెళ్లి కోసం ఏకంగా రు. 75 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసిన న‌టి ఐశ్వ‌ర్యాయే కావ‌డం విశేషం. ఇక పెళ్లి త‌ర్వాత కూడా ఐశ్వ‌ర్య‌కు క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. అయితే అభిషేక్ కెరీర్ మాత్రం ఇంకా ప‌డుతూ లేస్తూనే ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news