Newsదారుణం: ముగ్గురు అమ్మాయిలు... ఒక అబ్బాయిని న‌గ్నంగా... చెప్ప‌లేని విధంగా..!

దారుణం: ముగ్గురు అమ్మాయిలు… ఒక అబ్బాయిని న‌గ్నంగా… చెప్ప‌లేని విధంగా..!

ప్ర‌పంచం రోజు రోజుకు కొత్త పుంత‌లు తొక్కుతున్నా.. ప్ర‌పంచమే అర‌చేతిలో ఇమిడి పోతున్నా ఇంకా మూడాచారాలు మాత్రం కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా జార్ఖండ్‌లోని గ‌ర్హ్వా జిల్లా నారాయ‌ణ్‌పూర్‌లో గురువారం జ‌రిగిన దారుణ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. నారాయ‌ణ్‌పూర్‌లో ఉండే రాజ్వార్ కుటుంబంలో ఇద్ద‌రు బాలిక‌లు ఇటీవ‌ల అనారోగ్యానికి గుర‌య్యారు. వాళ్లు అనారోగ్యానికి గురి కావ‌డానికి చేత‌బ‌డే కార‌ణం అని ఓ కుటుంబంపై అనుమానం పెంచుకున్నారు.

 

గురువారం రాత్రి రాజ్వార్ కుటుంబీకులు, వాళ్ల బంధువులు చేత‌బ‌డి నెపంతో ముగ్గురు మహిళ‌ల‌తో పాటు ఓ వ్య‌క్తిని గ్రామంలో ర‌చ్చ‌బండ వ‌ద్ద‌కు తీసుకుని వ‌చ్చారు. వారిని కొట్ట‌డంతో పాటు వారి దుస్తులు ఊడ‌తీయించి న‌గ్నంగా ఊరేగించారు. ఈ దారుణ అరాచ‌కాన్న‌ని అడ్డుకునేందుకు నారాయ‌ణ్‌పూర్ వార్డు కౌన్సెల‌ర్‌తో పాటు మ‌రి కొంద‌రు ప్ర‌య‌త్నించినా రాజ్వార్ కుటుంబ స‌భ్యుల‌కు చాలా మంది పెద్ద‌లు మ‌ద్ద‌తుగా ఉండ‌డంతో వారు నిస్స‌హాయంగా ఉండ‌డం మిన‌హా ఏం చేయ‌లేక‌పోయారు.

 

వీరు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌గా.. పోలీసులు అక్క‌డ‌కు చేరుకునేలోగా రాజ్వార్ కుటుంబ స‌భ్యుల‌తో సహా అంద‌రూ పారిపోయారు. పోలీసులు బాధితులకు బట్టలు అందచేశారు. ఇప్ప‌టికే ఈ కేసులో ఇద్ద‌రిని అరెస్టు చేసిన పోలీసులు, మిగిలిన వారి కోసం వెతుకుతున్నారు. ఈ దారుణ సంఘ‌ట‌న‌పై ప్ర‌జా సంఘాలు తీవ్రంగా మండి ప‌డుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news