Newsమ‌హిళ‌కు మ‌స్కా కొట్టి కారులోనే గ్యాంగ్ రేప్‌... ర‌న్నింగ్ కారులోనే కుమార్తెతో...

మ‌హిళ‌కు మ‌స్కా కొట్టి కారులోనే గ్యాంగ్ రేప్‌… ర‌న్నింగ్ కారులోనే కుమార్తెతో స‌హా

ఓ మ‌హిళ‌కు మాయ మాట‌లు చెప్పి ర‌ప్పించుకోవ‌డంతో పాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన ఘ‌ట‌న పంజాబ్‌లోని అమృత్‌స‌ర్‌లో జ‌రిగింది. గ‌త నెల 6వ తేదీన జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. త‌న కోలీగ్‌కు యాక్సిడెంట్ అయ్యింద‌ని వెంట‌నే రావాల‌ని ఓ వ్య‌క్తి ఫోన్ చేయ‌డంతో బాధిత మ‌హిళ త‌న ప‌దేళ్ల కుమార్తెను తీసుకుని బ‌స్‌లో అమృత్‌స‌ర్‌కు చేరుకుంది. ఆమెకు ఫోన్ ఏచ‌సిన వ్య‌క్తి ఆమెను కారులో ఎక్కించుకున్నాడు.

 

ఆ మ‌హిళ‌కు డ్ర‌గ్స్ క‌లిపిన కూల్ డ్రింక్ ఇవ్వ‌డంతో ఆమె మ‌త్తులోకి జారుకుంది. వెంట‌నే బాధిత మ‌హిళ‌ను ఆమె కుమార్తెతో సహా కారులో హోటల్ కు తీసుకెళ్లారు. ఆ సమయంలో అప్పటికే ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్నారని మహిళ చెప్పింది. ఆ త‌ర్వాత ముగ్గురు క‌లిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఆ త‌ర్వాత ఆమెతో పాటు ఆమె కుమార్తెను ర‌న్నింగ్ కారులో నుంచి బ‌య‌ట‌కు తోసేశారు.

 

ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే భయంతో విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండిపోయానని మహిళ చెప్పింది. అయితే త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై తీవ్ర మ‌నోవేద‌న‌కు గురైన ఆమె ఎట్ట‌కేల‌కు ధైర్యం చేసి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు హోటల్ సీసీటీవీ పరిశీలించి బాధితురాలిపై అత్యాచారం జరిగిందా ? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news