Moviesసునీల్ హీరోయిన్ పెళ్ల‌యిపోయింది... భ‌ర్త ఎవ‌రంటే

సునీల్ హీరోయిన్ పెళ్ల‌యిపోయింది… భ‌ర్త ఎవ‌రంటే

సునీల్ హీరోయిన్ పెళ్ల‌యిపోయింది. సునీల్ హీరోయిన్ ఎవ‌రు ఆమెకు పెళ్లి ఏంట‌నుకుంటున్నారా ?  సునీల్ స‌ర‌స‌న ఉంగ‌రాల రాంబాబు సినిమాలో న‌టించింది మ‌ల‌యాళ న‌టి మియా జార్జ్. మియా ఇప్పుడు శ్రీమ‌తి మియాగా మారారు. ఆమె ప్ర‌ముఖ బిజినెస్‌మేన్ అశ్విన్ ఫిలిప్‌ను వివాహం చేసుకున్నారు. తాజాగా కేర‌ళ‌లోని కొచ్చిలో జ‌రిగిన వీరి పెళ్లి వేడుకకు క‌రోనా వ‌ల్ల చాలా త‌క్కువ మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మియా త‌న భ‌ర్త‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు.

ఇక మియా టీవీ న‌టిగా కెరీర్ ప్రారంభించింది. ఆ త‌ర్వాత ప‌లు సినిమాల్లో కూడా హీరోయిన్‌గా న‌టించింది. అమ‌ర‌కావ్యం అనే సినిమాతో ముందుగా తమిళ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన మియా తెలుగులో సునీల్ స‌ర‌స‌న ఉంగ‌రాల రాంబాబు చేస్తే అది ప్లాప్ అయ్యింది. ప్ర‌స్తుతం విక్ర‌మ్ కోబ్రాలో కూడా న‌టిస్తున్నారు. ‌న్మ‌ణిల్ల అనే మ‌ల‌యాళ సినిమా కూడా ఆమె చేతిలో ఉంది. ఈ కొత్త జంట పెళ్లి ఫొటోలు  సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news