హైద‌రాబాద్‌లో వ్య‌భిచారం… అంతా అక్క‌డ అమ్మాయిలే…!

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో క‌రోనా కుమ్మేస్తున్నా కూడా వ్య‌భిచారం మాత్రం ఆగ‌డం లేదు. తాజాగా గుట్టు చ‌ప్పుడు కాకుండా వ్య‌భిచారం జ‌రుగుతుండ‌డంతో పోలీసులు దాడులు చేసి విటులు, నిర్వాహ‌కులు, అమ్మాయిల‌ను ప‌ట్టుకున్నారు. న‌గ‌రంలోని పాత‌బ‌స్తీ కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవాబ్ సాబ్ కుంట బషారత్ నగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో కొద్ది రోజులుగా చాలా మంది అబ్బాయిలు వ‌చ్చిపోతున్నారు. దీనిపై స‌మాచారం అందుకున్న పోలీసులు ప‌క్కాగా దాడి చేశారు.

 

ఈ దాడిలో ఇద్దరు నిర్వహకులతో పాటు, ఒక విటుడు, ఏడుగురు బాధిత మహిళలను అదుపులోకి తీసుకొని రెస్క్యూ చేశారు. ఈ దాడుల్లో మొత్తం రు. 32 వేల‌తో పాటు మూడు సెల్‌ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. భార్య భ‌ర్త‌లు అయిన మిస్కిన్, తరన్నుమ్ గత కొన్ని రోజులగా ఈ వ్యభిచార దందా నిర్వ‌హిస్తున్న‌ట్టు విచార‌ణ‌లో తేలింది.

 

ఇక బాధిత యువ‌తులు విదేశీ రాష్ట్రాల‌కు చెందిన వారు కూడా ఉన్నారు. ఇద్ద‌రు యువ‌తులు వెస్ట్ బెంగాల్‌కు చెందిన వారు కాగా.. ఓ యువ‌తి క‌ర్నాట‌క నుంచి వ‌చ్చింది. మిగిలిన వారు పాత‌బ‌స్తీకి చెందిన వారు. నిర్వాహ‌కుల‌పై కేసు నమోదు చేసి బాధిత మహిళలను హోమ్‌కు తరలించారు.

Leave a comment