ర‌మ్య‌కృష్ణ రేటు చూసి త్రివిక్ర‌మ్ నోట మాటే రాలేదా…!

టాలీవుడ్‌లో ఐదు ప‌దుల వ‌య‌స్సు వ‌చ్చినా ర‌మ్య‌కృష్ణ క్రేజ్ గురించి చెప్ప‌క్క‌ర్లేదు. రెండున్న‌ర ద‌శాబ్దాల‌కు పైగా హీరోయిన్‌గా సౌత్ సినిమా ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపేస్తోన్న ర‌మ్య బాహుబ‌లి సినిమా త‌ర్వాత ఆ సినిమాలో చేసిన శివ‌గామి క్యారెక్ట‌ర్‌తో నేష‌న‌ల్ వైడ్‌గా పాపుల‌ర్ అయ్యింది. ఇప్పుడు ఈ వ‌య‌స్సులో కూడా ర‌మ్య సినిమాల్లో న‌టించాలంటే ఆమె చేసే డిమాండ్ మామూలుగా లేదు. ఈ వ‌య‌స్సులోనూ ఈ రేంజ్‌లో డిమాండ్ చేయ‌డం ఒక్క ర‌మ్య‌కే సాధ్య‌మైంది.

 

 

ఇక ఇప్పుడు ఆమెతో త‌మ సినిమాల్లో క్యారెక్ట‌ర్ రోల్స్ చేయించుకోవాల‌ని ప‌లువురు ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమాలో ఓ ప‌వ‌ర్ ఫుల్ రోల్ కోసం త్రివిక్ర‌మ్ ఆమెను సంప్ర‌దించాడ‌ట‌. త్రివిక్ర‌మ్ సినిమాల్లో ఓ ప‌వ‌ర్ ఫుల్ లేడీ రోల్ ఉండ‌డం కామ‌న్‌. అత్తారింటికిలో న‌దియా, అజ్ఞాత‌వాసిలో ఖుష్బూ, అల వైకుంఠ‌పురంలో ట‌బూ రోల్స్ కీల‌కం అయ్యాయి.

 

 

ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ లేడీ రోల్ కోసం త్రివిక్ర‌మ్ డైరెక్టుగా ర‌మ్య‌ను అడిగాడ‌ట‌. అయితే ఆమె ఏకంగా రు. 2 కోట్లు డిమాండ్ చేయ‌డంతో  త్రివిక్ర‌మ్ ఆమెను తీసుకునే విష‌యంల కాస్త డైల‌మాలోనే ఉన్నాడ‌ట‌. మ‌రి ఆమె అడిగినంత రేటు ఇచ్చి త్రివిక్ర‌మ్ ర‌మ్య‌ను తీసుకుంటాడా ?  లేదా ? అన్న‌ది చూడాలి.

Leave a comment