తెలుగు సినీ ల‌వ‌ర్స్‌కు బ్యాడ్ న్యూస్‌… అక్కినేని కోడ‌లు షాకింగ్ డెసిష‌న్‌… !

తెలుగు సినీ ప్రేమికుల‌కు గ‌త ద‌శాబ్దం కాలంగా అక్కినేని కోడ‌లు ఫేవ‌రెట్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో దాదాపు అంద‌రూ స్టార్ హీరోల‌తో నటించిన స‌మంత అక్కినేని వార‌సుడు నాగ‌చైత‌న్య‌ను పెళ్లాడి ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇదిలా ఉంటే పెళ్లి త‌ర్వాత కూడా ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ తెలుగు సినీ ల‌వ‌ర్స్‌ను మెప్పిస్తూనే ఉంది. ఈ యేడాది శ‌ర్వానంద్‌తో క‌లిసి జాను సినిమాలో కూడా నటించింది.

 

ఇక స‌మంత ఓ షాకింగ్ డెసిష‌న్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఆమె సినిమాల‌కు దాదాపు గుడ్ బై చెప్పేసిన‌ట్టే అని తెలుస్తోంది. కొంద‌రు ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆమెను క‌లిసి క‌థలు చెపుతున్నా ఆమె అంత ఆస‌క్తిగా ఉండ‌డం లేదంటున్నారు. ఇక నాగార్జున స‌మంత‌కు పూర్తిగా సినిమాలు బంద్ చేసేయాల‌ని ప్రెజ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ యేడాది లేదా వ‌చ్చే యేడాది ఆరంభంలో స‌మంత – చైతు దంప‌తులు పిల్ల‌లు క‌నాల‌న్న ప్లానింగ్ కూడా చేసుకుంటున్నార‌ట‌.

 

అందుకే ఆమె ఎంత‌మంది ద‌ర్శ‌కులు క‌లిసినా సినిమాలు ఒప్పుకోవ‌డం లేదంటున్నారు. మ‌హా అయితే నాగ‌చైత‌న్య‌తో ఓ సినిమా ఇక ఇత‌ర సినిమాల్లో చిన్న చిన్న గెస్ట్ రోల్స్ మిన‌హా ఆమె ఫుల్ హీరోయిన్ రోల్లో సినిమాలు చేసే అవ‌కాశం లేన‌ట్టే..!  ఏదేమైనా ఇన్నేళ్లుగా తెలుగు సినీ ల‌వ‌ర్స్‌ను అల‌రించిన స‌మంతను ఇక మ‌నం క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా చూడ‌లేం.

Leave a comment