రివ్యూలపై ఫైరయిన అలీ

టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో వస్తున్న అంశం రివ్యూలపై చిత్ర పరిశ్రమ ఫైర్ కావడం. సినిమా చూశాక కొంతమంది రాసే రివ్యూలు చిత్ర పరిశ్రమను దెబ్బేస్తున్నాయని చాలా మంది మండిపడతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోల దగ్గర నుండి చిన్న నటుల వరకు రివ్యూ రాసేవారిపై విరుచుకుపడ్డారు. తాజాగా ఈ జాబితాలో కమెడియన్ అలీ కూడా జాయిన్ అయ్యారు.

తాజాగా రిలీజ్ అయిన రాజు గారి గది 3 చిత్రంలో అలీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అలీ పాత్ర సినిమాకు మంచి బలాన్ని ఇచ్చింది. అయితే ఈ సినిమాపై రివ్యూలు అంతంత మాత్రంగా రావడంతో చిత్ర యూనిట్‌లో అలీ స్పందించాడు. రివ్యూలు రాసేవారు చిత్రాన్ని తక్కువచేసి చూపేలా రాయడం సబబు కాదన్నారు. దీని కారణంగా సినిమా కలెక్షన్లపై ప్రభావం పడుతుందని ఆయన అన్నారు. రాజు గారి గది 3 సక్సెస్ మీట్‌లో ఈ అంశం చోటు చేసుకుంది.

ఇక రివ్యూల వల్ల సినిమాలకు నష్టం వాటిల్లుతుందని.. దీనిని అందరూ వ్యతిరేకించాలని ఆయన కోరారు. రివ్యూలు రాసే వారు దీనిని దృష్టిలో పెట్టుకుని రివ్యూలు రాయాలని కోరారు.