బన్నీ రెడీ.. మరి మహేష్ ఎక్కడ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’ చిత్ర షూటింగ్‌ను యమ స్పీడుగా కొనసాగిస్తున్నాడు. కాగా సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు బన్నీ చకచకా ఫినిష్ చేస్తున్నాడు. అయితే ఇదే సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’తో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. అయితే బన్నీ అంత ఫాస్ట్‌గా మహేష్ తన జోష్ చూపించడం లేదంటూ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.

బన్నీ దీపావళి కానుకగా తన సినిమా నుండి రెండో సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ‘రాములో రాములా’ అంటూ ఈ పాటకు ఫుల్ క్రేజ్ వచ్చింది. ఇక ఈ సాంగ్ రిలీజ్ తరువాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని చిత్ర యూనిట్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ మహేష్ మాత్రం దీపావళి కానుకగా ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వడం లేదని ఆయన ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఏదేమైనా సంక్రాంతి బరిలో రెండు చిత్రాలు పోటీ పడుతుండగా ఏ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. మరి ఈ రెండు సినిమాల్లో సంక్రాంతి విన్నర్‌గా ఏది నిలుస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.