వరల్డ్‌వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్‌తో విజిల్ వేయించిన విజయ్

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం బిజిల్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై తమిళ వర్గాలతో మాత్రం తెలుగులోనూ మంచి బజ్‌ క్రియేట్ అయ్యింది. ఇక తెలుగులో ఈ సినిమాను విజిల్ పేరుతో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాను బయ్యర్లు భారీ రేటుకు కొని అదిరిపోయే రిలీజ్‌కు రెడీ చేశారు.

ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 25న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమా తెలుగు రైట్స్‌ను ఏకంగా రూ.10 కోట్లకు అమ్ముడుకాగా తమిళనాట ఏకంగా రూ.83.55 కోట్లకు ఈ చిత్ర హక్కులను అమ్మారు. బిజిల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.136.55 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసి దుమ్ములేపింది. ఇక ఏరియాల వారీగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

తమిళనాడు – 83.55 కోట్లు
ఏపీ+తెలంగాణ – 10 కోట్లు
కర్ణాటక – 8.5 కోట్లు
కేరళ – 3.5 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1 కోట్లు
ఆలిండియా టోటల్ – 106.55 కోట్లు
ఓవర్సీస్ – 30 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 136.55 కోట్లు

Leave a comment