Gossipsఆ హీరో కొంప కొల్లేరు చేస్తోన్న శ‌ర్వానంద్‌..

ఆ హీరో కొంప కొల్లేరు చేస్తోన్న శ‌ర్వానంద్‌..

టాలీవుడ్‌లో అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ త‌న‌యుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఏ ముహూర్తాన ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాడో కాని ఒక్క హిట్ కూడా లేదు. బ‌డా బ‌డా ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేస్తోన్న శ్రీనుకు హిట్ రావ‌డం గ‌గ‌నం అయిపోయింది. రీసెంట్‌గా చేసిన క‌వ‌చం – సీత కూడా ఘోరంగా ప్లాప్ అయ్యాయి. ఇప్పుడు కోలీవుడ్ హిట్ రాచ్చ‌స‌న్ రీమేక్‌గా రాక్ష‌సుడు పేరుతో త్వ‌ర‌లో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

రీమేక్ సినిమా కావ‌డంతో ఈ సినిమా ఖ‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని బెల్లంకొండ ఆశ‌లు పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని అన్న‌ట్టుగా బెల్లంకొండ‌కు సోలో రిలీజ్ డేట్ ద‌క్క‌నీయ‌డం లేదు. ముందుగా రాక్ష‌సుడు సినిమాను జూలై 19న విడుదల‌కు ఫిక్స్ చేశారు. స‌రిగ్గా ఇస్మార్ట్ శంక‌ర్ ఈ నెల 12 నుంచి 19కు పోస్ట్ పోన్ అయ్యింది. రామ్‌తో పోటీ రిస్క్ చేయ‌లేక రాక్ష‌సుడు సినిమాను ఆగ‌స్టు 2కు వాయిదా వేసుకుని పోస్ట‌ర్లు కూడా వేసుకున్నారు.

ఇప్పుడు శ‌ర్వానంద్ మ‌ళ్లీ బెల్లంకొండ‌కు షాక్ ఇస్తున్నాడు. శర్వానంద్ రణరంగం ఆ రోజునే వ‌స్తోంది. ఒకే రోజు ఈ ఇద్ద‌రు యంగ్ హీరోలు త‌మ సినిమాల‌తో పోటీకి రెడీ అవుతున్నట్టే. పోటీ లేకుండా ఉండాలంటే ఒక సినిమా వాయిదా వేయాలి. ఇప్పటికే రాక్షసుడు వాయిదాలు పడి ఇక్కడకు చేరుకుంది. రెండు సినిమాలు ఒకే రోజు వ‌స్తే ఖ‌చ్చితంగా శ‌ర్వా సినిమాకే ఎడ్జ్ ఉంటుంది. శ‌ర్వా క్రేజ్ బెల్లంకొండ‌కు లేదు. అలాగే సుధీర్ వర్మకు వున్న క్రేజ్ రమేష్ వర్మకు లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news