Gossipsబంగార్రాజులో ఛాన్స్ కొట్టేసి హాట్ బ్యూటీ..!

బంగార్రాజులో ఛాన్స్ కొట్టేసి హాట్ బ్యూటీ..!

అక్కినేని నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ మూవీకి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ రాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. ‘సోగ్గాడే చిన్నినాయనా’ మూవీలో ఒక క్యారెక్టర్ పేరు బంగార్రాజు..ఆ మూవీకి ఆ క్యారెక్టరే హైలెట్ కావడంతో ఎంతో మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకు అదే పేరు ‘బంగార్రాజు’అని ఫిక్స్ చేశారు. ఈ మూవీలో నాగార్జున, నాగ చైతన్య కలసి నటించబోతున్నారు.

నాగార్జున సరసన నటించే హీరోయిన్ విషయంలో పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికే ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పూత్ ని అనుకున్నారు. మరో హీరోయిన్ పై ఇప్పటి వరకు ఎన్నో వార్తలు వచ్చాయి..కానీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాత్రం పూజా హెగ్డేనే ఫిక్స్ చేసేందుకు సిద్దమయ్యారట. మరోవైపు నాగ చైతన్యకు జోడిగా కీర్తి సురేష్ నటించనుంది.

పూజా హెగ్డే అంగీకరిస్తే తన కొడుకు సరసన నటించిన మరో హీరోయిన్ తో నాగ్ రొమాన్స్ చేసినట్లు అవుతుంది. రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంలో రకుల్, నాగ చైతన్య జంటగా నటించారు. ప్రస్తుతం రకుల్ మన్మథుడు 2లో నటిస్తోంది. పూజా హెగ్డే, నాగ చైతన్య కలసి ఒక లైలా కోసం చిత్రంలో నటించారు. మొత్తానికి పూజా హెగ్డే టైమ్ బాగుందంటున్నారు సినీ వర్గాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news