Gossipsవిజ‌య్ హీరోయిన్ టాప్ హీరోతో డేటింగ్‌..

విజ‌య్ హీరోయిన్ టాప్ హీరోతో డేటింగ్‌..

విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న మాళవిక మోహన్ బాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తున్న గుట్టు ఎట్టకేలకు రట్టయ్యింది. ఝురి సినిమాతో పాపులర్ అయిన విక్కీకౌశ‌ల్ తాజాగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. నేహా ధూపియా షోలో హాట్ హీరోయిన్ రాధిక ఆప్టే వీరిద్దరి డేటింగ్ గుట్టును రట్టు చేసింది. వాస్తవానికి కౌశల్ ఇంతకుముందే మరో అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడు.

ఆమెతో బ్రేకప్ అయ్యాక మాళవిక మోహన‌న్‌తో ఏర్పడిన పరిచయంతో ఆరేడు నెలలుగా వీరిద్దరూ మునిగిపోయారు అంట. ఆరేడు నెలలుగా వీరిద్దరూ డేటింగ్‌లో మునిగిపోయార‌ట. చాలా విషయాలపై ఓపెన్ గా మాట్లాడే రాధికా ఆప్టే… విక్కీ-మాళవిక ఎఫైర్ ను బయటపెట్టింది. తన తమ్ముడు కూడా మాళవికకు బాగా క్లోజ్ కాబట్టి విక్కీ-మాళవిక ఎఫైర్ గురించి తనకు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వస్తుంటాయని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

ఇక‌పై అయినా మాళ‌విక – వీక్కీ త‌మ ఎఫైర్ బంధాన్ని బ‌హిర్గ‌తం చేయాల‌ని… డేటింగ్ గుట్టుగా చేస్తుంటే ఒత్తిడి ఉంటుంద‌ని.. ఇక‌పై ఈ జంట ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎంజాయ్ చేయ‌వ‌చ్చని కూడా రాధిక చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఈ షోలో విక్కీ కౌశ‌ల్ స‌మ‌క్షంలోనే రాధిక ఈ విష‌యాలు బ‌య‌ట పెట్ట‌డం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news