Gossipsహీరోయిన్స్ కు ధీటుగా చూపిస్తున్న శ్రీముఖి..

హీరోయిన్స్ కు ధీటుగా చూపిస్తున్న శ్రీముఖి..

ముందు హీరోయిన్ గా ప్రయత్నించి అక్కడ సెట్ అవ్వక ఆ తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ అవడం కొందరు భామలు చేసే పని. సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా చేసి స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా అలరిస్తారు. వారిలో యాంకర్ శ్రీముఖి ప్రధమంగా చెప్పుకొవచ్చు. పటాస్ షోతో ఆమె క్రేజ్ ఏ రేంజ్ కు వెళ్లిందో అందరికి తెలుసిందే. ఇటీవల ఆ షోకి గ్యాప్ ఇచ్చిన అమ్మడు బిగ్ బాస్ 3లో కంటెస్టంట్ గా వెళ్తుందని అంటున్నారు.

అయితే తాను బిగ్ బాస్ షోకి వెళ్లట్లేదని క్లారిటీ ఇచ్చింది శ్రీముఖి. ఒకవేళ ఆమె షోకి వెళ్తే మాత్రం అమ్మడికి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టే. ఇదిలాఉంటే ఈమధ్య అమ్మడు తన గ్లామర్ మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. రీసెంట్ టైమ్స్ లో బొద్దుగా కనిపిస్తున్న శ్రీముఖి ప్రస్తుతం కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. ఆ విషయాన్ని చెబుతూ నడుము అందాలతో ఫోటో షూట్ చేసింది.

ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమాలో హీరోయిన్ చూపించే అందాల ప్రదర్శన కన్నా శ్రీముఖి అందాల ప్రదర్శన షాక్ ఇస్తుంది. నాభి అందాలతో శ్రీముఖి క్రేజీగా ఉంది. తను పటాస్ షో ఎందుకు ఆపేశానో కొద్దిరోజుల్లో చెబుతా అన్న శ్రీముఖి మళ్లీ హీరోయిన్ ఛాన్స్ పట్టేసిందా లేక నిజంగానే బిగ్ బాస్ లో కంటెస్టంట్ గా వెళ్తుందా అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news