Gossipsరాజమౌళి మహాభారతంలో సంపూర్ణేష్ బాబు..!

రాజమౌళి మహాభారతంలో సంపూర్ణేష్ బాబు..!

కొబ్బరిమట్ట సినిమా టీజర్ లో మూడున్నర నిమిషాల డైలాగ్ ను సింగిల్ టేక్ లో చెప్పి తెలుగు ప్రేక్షకులను అబ్బురపరచాడు సంపూర్ణేష్ బాబు. స్టార్ హీరోలకు ధీటుగా సంపూర్ డైలాగ్ అలరించింది. ముఖ్యంగా ఈ డైలాగ్ మొత్తం సింగిల్ టేక్ లో చెప్పడం నటనపై తనకు ఉన్న ఆసక్తి ఏంటన్నది తెలియచేస్తుంది. కొబ్బరిమట్ట సినిమాలో మూడు పాత్రల్లో కనిపిస్తున్నాడు సంపూర్ణేష్ బాబు.

నిన్న ఆడ్రాయిడు పాత్రలో చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక నిన్న ఆ డైలాగ్ చూసిన తెలుగు ఆడియెన్స్ రాజమౌళి చేసే మహాభారతం సినిమాలో సంపూర్ణేష్ కు ఓ మంచి రోల్ ఇచ్చే అవకాశం ఉందని కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే సంపూ దానికి అర్హుడని చెప్పొచ్చు. సంపూర్ణేష్ చేసిన హృదయ కాలెయం సినిమాకు రాజమౌళి ట్వీట్ ఆ సినిమాపై అటెన్షన్ ఏర్పడేలా చేసింది.

ఇప్పుడు రాజమౌళి కొబ్బరిమట్ట డైలాగ్ టీజర్ చూశాక తప్పకుండా మహాభారతం సినిమాలో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. జక్కన్న డ్రీం ప్రాజెక్ట్ అయిన మహాభారతం సినిమాలో నిజంగా సంపూ ఛాన్స్ దక్కించుకుంటాడా.. మరి అప్పటికి సంపూ రాజమౌళికి గుర్తుండాటా అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news