Gossipsడియ‌ర్ కామ్రేడ్‌పై వ‌ర్మ సూప‌ర్ సెటైర్‌

డియ‌ర్ కామ్రేడ్‌పై వ‌ర్మ సూప‌ర్ సెటైర్‌

టాలీవుడ్‌లో గ‌త వారం రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంక‌ర్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రెండో వారంలోనూ ఇస్మార్ట్‌గా దూసుకుపోతోంది. రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన ఈ సినిమా రెండో వారంలోనూ స్ట‌డీగా వ‌సూళ్లు రాబ‌డుతోంది. ఇక ఇస్మార్ట్ రూ.40 కోట్ల షేర్ మార్క్ వైపు దూసుకుపోతోంది. ఇక ఈ శుక్ర‌వారం వ‌చ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌ డియర్ కామ్రేడ్ చిత్రం తొలి రోజే డివైడ్ టాక్ తో డీసెంట్‌గా పెర్ఫామ్ చేస్తుండగా… ఇస్మార్ట్ మాత్రం చాలా చోట్ల కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

కామ్రేడ్ నాలుగో రోజు అయిన సోమ‌వారానికే పూర్తిగా తేలిపోయింది. ఇంకా చెప్పాలంటే భారీ ప్లాప్ దిశ‌గా వెళుతోంది. ఇక ఇస్మార్ట్ హిట్‌ను పూరి టీం అంతా బాగా ఎంజాయ్ చేస్తోంది. ఈచిత్రం హిట్ అవుతుందని పూరీనే అనుకోలేదు. ఇది స్వయంగా పూరీనే చెప్పాడు. విచిత్రం ఏంటంటే శిష్యుడు పూరికి చాలా రోజుల త‌ర్వాత హిట్ రావ‌డంతో వ‌ర్మ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.

తాజాగా వ‌ర్మ‌ చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. డియర్ కామ్రేడ్ అండ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలని పోలుస్తూ ఆయన ఈ ట్వీట్ చేసారు. ‘ఇస్మార్ట్ శంకర్ నాన్‌ఇస్మార్ట్ కామ్రేడ్ కంటే ఇస్మార్ట్‌గా ఉందా.. లేక.. నాన్‌ఇస్మార్ట్ కామ్రేడ్ ఇస్మార్ట్ శంకర్‌ను మించిపోయిందా?.. నిజం రామ్ విజయానికి తెలుసు.’ అని ట్వీట్ చేసారు. అంటే ఇండైరెక్ట్ గా విజయ్ పై సెటైర్ వేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news