Gossipsబ‌న్నీ వ‌ద్దు.... మ‌హేష్ ముద్దు

బ‌న్నీ వ‌ద్దు…. మ‌హేష్ ముద్దు

అల్లు అర్జున్.. త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేగంగా జరుగుతున్నది. వ‌చ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాల్లో రావు రమేష్ తప్పకుండా ఉంటాడు. ఈ సినిమాలో కూడా మొదట రావు రమేష్‌ను తీసుకున్నారు. అయితే ఇప్పుడు స‌డెన్‌గా రావు ర‌మేష్‌ను త‌ప్పించేసి ఆ స్థానాన్ని హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌తో భ‌ర్తీ చేశారు.

ఈ విష‌యం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. బ‌న్నీ సినిమా నుంచి రావు రమేష్ ను ఎందుకు పక్కన పెట్టారు అనే దానిపై అనేక రూమర్లు వస్తున్నాయి. ఎవ‌రి మాట‌లు ఎలా ? ఉన్నా రావు ర‌మేష్ ఈ విష‌యంలో కాస్త అస‌హ‌నంతోనే ఉన్నాడంటున్నారు. రావు రమేష్ మొదట బన్నీ సినిమా కోసం రెండు నెలల కాల్షీట్స్ ఇచ్చారట. అనుకోని విధంగా షూటింగ్ ఆలస్యం కావడంతో ఇచ్చిన డేట్స్ లో చాలా వేస్ట్ అయిపోయాయ‌ట‌.

ఇప్పుడు మ‌ళ్లీ త్రివిక్ర‌మ్ అడిగిన‌న్ని డేట్లు ఇవ్వ‌న‌ని ర‌మేష్ చెప్పేశాడ‌ట‌. రావు ర‌మేష్‌నే కొన‌సాగించాల‌ని అంటే కొన్ని రోజులు అడ్జెస్ట్ అవుతాయి కానీ, పూర్తిగా సర్దుబాటు చేయడం కుదరకపోవడంతో రావు రమేష్ ప్లేస్ లో అమృతం ఫేమ్ హర్షవర్ధన్ ను తీసుకున్నారని తెలుస్తోంది. అయితే అదే టైంలో మ‌హేష్‌బాబు – అనిల్ రావిపూడి స‌రిలేరు నీకెవ్వ‌డు సినిమాలో న‌టిస్తోన్న రావు ర‌మేష్ ఈ సినిమాకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు బ‌న్నీ సినిమాకు మెహ‌మాటం లేకుండా నో చెప్పేశాడ‌ట‌. ఇది అస‌లు స్టోరీ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news