ఉప్పెనలా వస్తానంటున్న మెగా హీరో..!

మెగా కాంపౌండ్‌ నుండి వచ్చిన అరడజన్ హీరోలలో రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌లు మంచి గుర్తింపును సాధించుకున్నారు. ఇప్పుడు వీరి అడుగుజాడల్లో వచ్చేందుకు మరో మెగా హీరో సిద్ధమయ్యాడు. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తొలి చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకునేందుకు తెగ కష్టపడుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
2
కాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. కాగా జాలరి అనే టైటిల్‌ను ఈ చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇవేమీ నిజం కాదంటూ.. చిత్ర యూనిట్ ఈ సినిమాకు ఉప్పెన అనే టైటిల్‌ను ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేయించారు. జాలరిగా కనిపించే వైష్ణవ్ తేజ్ ఈ సినిమాలో అదిరిపోయే నటనతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేసిన బుచ్చిబాబు ఈ సినిమాతో డైరెక్టర్‌గా మారుతున్నాడు.

ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలోని మిగతా క్యాస్టింగ్ గురించి ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a comment