బాలయ్య బ్యూటీని లెక్కచేయని మహేష్..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. టాలీవుడ్‌లో ఇటీవల పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక వాటిని రెట్టింపు చేశాయి ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేతో పాటు మరో బ్యూటీ కూడా ఆడియెన్స్‌‌ను ఇంప్రెస్ చేసేందుకు రెడీ అవుతోంది. కానీ ఆ పాపను కనీసం పట్టించుకోవడం కూడా లేదు మహేష్ అదే మహర్షి టీం.

బాలయ్యతో కలిసి లెజెండ్ సినిమాలో కనిపించిన బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహన్‌ ఆ తరువాత అడపాదడపా కొన్ని సినిమాల్లో కనిపించింది. పెద్ద ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్లు చేయడంతో ఆమె ఉందనే విషయాన్నే మర్చిపోయారు తెలుగు ఆడియెన్స్. అయితే మహర్షి సినిమాలో అమ్మడికి ఓ మంచి పాత్ర లభించినట్లు తెలుస్తోంది. కానీ అమ్మడికి సంబంధించి ఎలాంటి పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ ఇప్పటివరకు చూపించలేదు. దీంతో ఈ సినిమాలో ఆమె ఉందన్న విషయమే తెలీదు జనాలకు. పోనీ చిత్ర ప్రమోషన్లకు అమ్మడిని ఏమైనా పిలుస్తున్నారా అంటూ అదీ లేదు.

అయితే ఆమె పాత్రను చాలా సీక్రెట్‌గా ఉంచాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకే ఆమెకు సంబంధించి ఎలాంటి పోస్టర్లు రిలీజ్ చేయట్లేదు మహర్షి టీం. ఏదేమైనా ఆమెను మరీ ఇంతలా దాచాల్సిన అవసరం లేదని అంటున్నారు సినీ క్రిటిక్స్.

Leave a comment