గుడ్ న్యూస్ చెప్పిన RRR యూనిట్..

టాలీవుడ్ జనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న RRR చిత్రం షూటింగ్ ఇటీవల వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు తెలుగు ఆడియెన్స్. అయితే షూటింగ్‌లలో రామ్ చరణ్, తారక్‌లు వరుసగా గాయాలు కావడంతో గత నెల రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ అటకెక్కింది.

అయితే ఈ ఇద్దరు హీరోలు మళ్లీ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేసి ఈ సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. పీరియాడికల్ మూవీగా రానున్న ఈ సినిమాలో తారక్, చరణ్‌లు ఫ్రీడమ్ ఫైటర్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్, ఆలియా భట్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్ తారక్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

బాహుబలి సృష్టికర్త రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య కళ్లు చెదిరే బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే 2020 జూలై 30 వరకు ఆగాల్సిందే.

Leave a comment