కోతి బొమ్మలతో ఆవేదన వ్యక్తం చేసిన వర్మ..

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా అది ఓ సెన్సేషన్ అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల ఆయన నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’రిలీజ్ అయి ప్రభంజనం సృష్టించింది. కాకపోతే ఏపిలో మాత్రం ఈ సినిమా రిలీజ్ కాలేదు. అక్కడ ఎన్నికల పై ప్రభావం పడుతుందని కొంతమంది హై కోర్టును ఆశ్రయించడంతో .. న్యాయస్థానం స్టే విధించింది.

సుప్రీమ్ కోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. కాకపోతే ఈ సినిమా తెలంగాణ..ఇతర రాష్ట్రాల్లో రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఏపిలో రిలీజ్ చేయనివ్వడం లేదని వర్మ తన ఆవేదనను కోతి బొమ్మల రూపంలో వ్యక్త పరిచారు.
12
గొలుసులతో కట్టేయబడిన ఒక కోతిపిల్ల పెయింటింగును వర్మ షేర్ చేశారు. ఆ కోతిపిల్లను ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాగా చెబుతూ, ఈ సినిమాను ఏపిలో రిలీజ్ చేయించడానికి ఎంతో కష్టపడ్డాను..ఇక అలసిపోయాను అంటూ దాని పరమార్థం తెలిపారు.

మరో బొమ్మలో తల్లికోతి .. పిల్లకోతిని ఓదార్చే మరో పెయింటింగును కూడా ఆయన షేర్ చేశారు. తాను తల్లికోతిగా..’లక్ష్మీస్ ఎన్టీఆర్’ని పిల్లకోతిగా ప్రస్తావిస్తూ… ఏపిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ పరిస్థితి ఇంత దారుణం అని పేర్కొన్నారు. ఏది ఏమైనా రాంగోపాల్ వర్మ సృజనాత్మకతకు సోషల్ మీడియాలో తెగ చర్చలు కొనసాగుతున్నాయి.
11

Leave a comment