Moviesసాయి ధరం తేజ్ 'చిత్రలహరి' రివ్యూ & రేటింగ్

సాయి ధరం తేజ్ ‘చిత్రలహరి’ రివ్యూ & రేటింగ్

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్.. సాయి తేజ్ గా పేరు మార్చుకుని మరి చేసిన సినిమా చిత్రలహరి. కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. కళ్యాణి ప్రియదర్శిని, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

లైఫ్ లో అసలు సక్సెస్ అనేదే తెలియని విజయ్ క్రియేటివ్ ఐడియాస్ తో పనులు చేస్తున్నా అవి సక్సెస్ అవ్వవు. ఇక ఈ ప్రయత్నంలో లహరి (కళ్యాణి ప్రియదర్శిని) చూసి ఇష్టపడతాడు విజయ్. లహరి కూడా విజయ్ ను ఇష్టపడుతుంది. అయితే ఓ సందర్భంలో విజయ్ ఓ టివి షాప్ లో చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత అతన్ని దూరంగా ఉంచుతుంది. లవ్ లో కూడా ఫెయిల్ అయిన విజయ్ కు చిత్ర (నివేదా పేతురాజ్) పరిచయం అవుతుంది. ఆమె విజయ్ కు హెల్ప్ చేయాలని అనుకుంటుంది. విజయ్ తయారు చేసిన యాక్సిడెంట్ అలర్ట్ సిస్టెం డివైజ్ స్టార్ట్ అప్ కోసం హెల్ప్ చేయాలని అనుకుంటుంది. కాని అందులో కూడా ఫెయిల్ అవడంతో ఆ యాక్సిడెంట్ అలర్ట్ సిస్టెం ప్రయోగాన్ని చేసేందుకు స్పీడ్ డ్రైవ్ చేస్తాడు.. దానితో విజయ్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. కోర్ట్ లో కేసు వాదోపవాదాలు విన్న జడ్ విజయ్ ను వదిలేస్తాడు. ఇది చిత్రలహరి కథ.

నటీనటుల ప్రతిభ :

మెగా మేనళ్లుడు సాయి తేజ్ విజయ్ పాత్రలో సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడని చెప్పొచ్చు. ఇదవరకు తన ప్రతి సినిమాలో మేనమాల మేనరిజం చూపించే సాయి తేజ్ ఈసారి అలాంటి అతి చేయలేదు. చాలా సెటిల్డ్ గా సినిమా చేశాడు. కొన్ని సీన్స్ లో చాలా పరిణితితో నటించి మెప్పించాడు. ఇక సినిమాలో హీరోయిన్స్ కళ్యాని ప్రియదర్శి, నివేదా పేతురాజ్ ఓకే అనిపించారు. కళ్యాణి క్యూట్ లుక్స్ ఇంప్రెస్ చేస్తాయి. అయితే హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇక పోసానికి మరో మంచి పాత్ర పడ్డది. సునీల్, వెన్నెల కిశోర్ ల కామెడీ పర్వాలేదు అనిపిస్తుంది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సాంకేతికవర్గం పనితీరు :

కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా ఆన్ స్క్రీన్ చాలా రిచ్ గా కనిపిస్తుంది. క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవలేదని చెప్పొచ్చు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. రెండు సాంగ్స్ బాగున్నాయి. బిజిఎం కూడా సినిమాకు హెల్ప్ అయ్యింది. శేఖర్ ప్రసాద్ ఎడిటింగ్ జస్ట్ ఓకే. కథ, కథనాల్లో దర్శకుడు ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే బాగుండేదనిపిస్తుంది. మైత్రి మూవీస్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

విశ్లేషణ :

జీవితంలో అసలు సక్సెస్ టేస్ట్ ఎలా ఉంటుందో చూడని విజయ్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్నది చిత్రలహరి కథ. లహరిని తను ప్రేమించగా చిత్ర విజయ్ ను ప్రేమిస్తుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా సినిమాలో ఉంటుంది. ఫైనల్ గా చిత్రలహరి సాయి తేజ్ ఫ్లాప్ సినిమాల కన్నా బెటరే కాని అనుకున్నంత రేంజ్ లో అయితే లేదని చెప్పొచ్చు.

ఫస్ట్ హాఫ్ సరదాగా తీసుకెళ్లిన డైరక్టర్ సెకండ్ హాఫ్ కాస్త వెనుకపడ్డాడు. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా ఆశించినంతగా లేవు. సినిమాలో సాయి తేజ్ నటనకు నూటికి నూరు మార్కులు పడతాయి. హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ విషయంలో కూడా దర్శకుడు ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది.

సినిమా మెగా ఫ్యాన్స్ కే కాదు యూత్ ఆడియెన్స్ కు నచ్చేలా ఉంది. డైరక్టర్ కిశోర్ తిరుమల చిన్న మెసేజ్ కూడా సినిమాతో చెప్పాడు. మరి అసలు టాక్ ఏంటన్నది ప్రేక్షకుల స్పందన చూస్తే అర్ధమవుతుంది.

ప్లస్ పాయింట్స్ :

సాయి తేజ్

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

స్టోరీ

క్లైమాక్స్

హీరో హీరోయిన్ కెమిస్ట్రీ

బాటం లైన్ :

సాయి తేజ్ ను వెంటాడుతున్న దురదృష్టం..!

రేటింగ్ : 2.5/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news