చివరికి చిరుని నమ్ముకుంటున్న సునీల్..?

సునీల్ ఈ పేరు వింటే ఒకప్పుడు థియేటర్లో కూర్చున్న వారు కడుపుబ్బా నవ్వుకునే కమెడిన్ గా గుర్తుకు వస్తారు. లావు గా ఉండి..తనదైన యాస తో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ సునీల్ ఒక రకంగా బ్రహ్మానందం రీ ప్లేస్ అనుకున్నారు. ఇదే సమయానికి ‘అందాల రాముడు’ సినిమాతో ఒక్కసారే హీరోగా యూటర్న్ తీసుకున్నాడు.

ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ‘మర్యాద రామన్న’సినిమాతో సునీల్ జాతకమే మారిపోయింది. వరుసగా హీరోగా పలు సినిమాల్లో నటించారు. అయితే కొంత కాలంగా సునీల్ నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్లు అయ్యాయి. దాంతో మనోడు మళ్లీ కమెడియన్ గా యూటర్న్ తీసుకున్నాడు.

ఇటీవల అరవింద సమేత కమెడియన్ గా నటించిన సునీల్ ఈ నెల 12న రిలీజ్ అయిన చిత్రలహరి మూవీలో మంచి కామెడీ పండించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను త్వరలో ఓ పెద్ద హీరో మూవీలో నటించబోతున్నట్లు చెప్పారు. అయితే సైరా సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకులు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే సునీల్ మెగాస్గార్ చిరంజీవి సినిమాలో ఛాన్సు వచ్చే ఉంటుందని భావిస్తున్నారు. వాస్తవానికి గతంలో సునీల్ కి చిరు 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’లో నటించే ఛాన్స్ వచ్చింది కానీ అప్పుడు కాల్షీట్స్ సర్దుబాటు చేయలేక సునీల్ ఆ ఆఫర్ వదులుకున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించనున్న ఇప్పుడు మరోసారి చిరంజీవి నుండి పిలుపు రావడంతో సునీల్ చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a comment