వామ్మో.. కాజల్‌కు 10.. సౌత్‌లోనే తోపు..!

టాలీవుడ్‌లో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా స్టార్ బ్యూటీల లెక్కే వేరుగా ఉంటుంది. ముఖ్యంగా కొంతకాలం స్టార్ స్టేటస్‌ను ఎంజాయ్ చేసిన బ్యూటీలు ఫాం కోల్పోయినవెంటనే ఫేడ్ అవుట్ అయిపోతారు. కానీ తెలుగులో దశాబ్ధ కాలంగా స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్న బ్యూటీలు కొందరు ఉన్నారు. వీరిలో అందాల చందమామ కాజల్ కూడా ఒకరు. అయితే ఈ అమ్మడు ఇప్పుడు ఓ సరికొత్త రికార్డు సృష్టించింది.

కాజల్‌కు అభిమానులు ఎంత మంది ఉన్నారో అందరికీ తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉండే కాజల్ పాపకు బయటకంటే ఎక్కువ అభిమానులు ఉన్నారు. ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాజల్‌ ఫాలోయింగ్ ఎంతలా ఉందంటే.. మిగతా స్టార్ హీరోయిన్లు కుళ్లుకుంటున్నారు. అమ్మడికి ఫాలోయింగ్ పీక్స్‌లో ఉంది కాబట్టే ఆ లెక్క 10 మిలియన్ దాటింది. దీంతో టాలీవుడ్‌లోనే ఇంత ఫాలోయింగ్ ఉన్న బ్యూటీగా కాజల్ ఓ సరికొత్త ట్రెండ్ సృష్టించింది. ఇక కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా యావత్ సౌత్ ఇండస్ట్రీలోనే ఈ ఫీట్ సాధించిన హీరోయిన్‌గా కాజల్ వండర్ క్రియేట్ చేసింది.

అటు వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ క్వీన్‌గా కాజల్ నిలిచింది. పెద్ద, చిన్న తేడా లేకుండా అందరు హీరోలతో రొమాన్స్ చేయడానికి ఎప్పుడూ ముందుండే కాజల్ మరింత సక్సెస్ సాధించాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

Leave a comment