Gossipsఆ వ్యక్తుల చేతిలో రష్మిక కీలుబొమ్మగా మారిందా..?

ఆ వ్యక్తుల చేతిలో రష్మిక కీలుబొమ్మగా మారిందా..?

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని కన్నడ భామ రష్మిక బాగా వంటబట్టించుకుంది. సినీ కెరియర్ దాదాపు ముగిసింది అనుకుంటున్న సమయంలో తెలుగులో ఆమెకు గీతగోవిందం సినిమా ద్వారా భారీ హిట్ దక్కడంతో తన వ్యక్తిగత జీవితాన్ని సైతం పక్కనపెట్టేసింది. రష్మికకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తుండడంతో.. గతేడాది కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో జరిగిన నిశ్చితార్ధాన్ని సైతం రద్దు చేసుకుంది రష్మిక. అయితే దీని వెనుక పెద్ద కథే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
rashmika-mandanna-632-1537786246
తన మేనేజర్ల మాటల ప్రభావంతో రష్మిక బ్రేకప్‌పై నిర్ణయం తీసుకొన్నదనే విషయం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఆమె బ్రేకప్ వ్యవహారం వెనుక మేనేజర్లు కీలకంగా వ్యవహరించినట్టు.. ఈ విషయంలో ఆమెను వారే తప్పుదోవ పట్టించినట్టు తెలుస్తోంది. గీత గోవిందం విజయాన్ని వారు ఉదాహరణగా చూపించి.. ఇప్పుడిప్పుడే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదుగుతున్న నీకు పెళ్లి పెద్ద అడ్డంకి అవుతుంది కాబట్టి పెళ్లి విషయాన్ని కొన్ని సంవత్సరాలు పక్కనపెట్టడంతో పాటు పూర్తిగా టాలీవుడ్ మీద దృష్టిపెట్టమని వారు సలహా ఇవ్వడంతో ఆమె వారి మాటల ప్రకారం నడుచుకున్నట్టు తెలుస్తోంది.
rashmikamandanna4-1537786219
అయితే రష్మిక మేనేజర్లను గుడ్డిగా నమ్మడం సరికాదని, వారి విషయంలో హద్దుల్లో ఉంచకపోతే ముందు ముందు చాలా నష్టపోవాల్సి ఉంటుందని సినీ పెద్దలు కొంతమంది ఆమెకు సలహాలిస్తున్నారట. గీత గోవిందం సినిమా విజయం రష్మిక మందన్న కాన్ఫిడెన్స్ పెంచిందనడంలో సందేహం లేదు కానీ ఆమె మాత్రం మేనేజర్ల విషయంలో ఆచితూచి అడుగులెయ్యలే తప్ప వ్యక్తిగత విషయాల్లో వాళ్ళ ప్రమేయం లేకుండా చూసుకుంటే మంచిది అనే అభిప్రాయం ఇప్పడు అందరిలోనూ వ్యక్తం అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news