Newsమళ్లీ భగ్గుమన్న పెట్రోల్ ధరలు..!

మళ్లీ భగ్గుమన్న పెట్రోల్ ధరలు..!

పెట్రోల్ రేట్లు రోజు రోజుకి పెరిగిపోయి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. బండి బయటకి తీయాలంటేనే సామాన్యులు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చుక్కలంటిన పెట్రోల్, డిజిల్ ధరలు బీజేపీ ప్రభుత్వం వచ్చాక కొంచెం తగ్గుముఖం పట్టినట్టు కనిపించాయి. అయితే.. ఈ మధ్యకాలంలో ఈ ధరలు విపరీతంగా పెరుగుపోతూ సెంచురీకి దగ్గరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్న ఏపీలో లీటర్ పెట్రోల్ ధర 87 .94 గా ఉంది.మొన్న ఈ ధర 87 .79 గా ఉంది.

ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌పై ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యాట్‌ రేటు అమలులో ఉండడం కారణంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రేటు ఉంది. అలా కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే పన్ను విధానం తీసుకురావాలని కేంద్రంపై కొని రాష్ట్రాలు వత్తిడి తీసుకొస్తున్నాయి. ఇంధన ధరలతో పాటు మద్యం, వాహనాల రిజిస్ట్రేషన్‌, రవాణా పర్మిట్‌పై కూడా ఒకే పన్ను విధానం తీసుకువచ్చేలా కేంద్రంపై వత్తిడి తీసుకురావాలని కొన్ని రాష్ట్రాలు నిర్ణయించాయి. దీనిపై ఓ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసి 15రోజుల్లోగా వీటిని అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నాయి. ఇది జరిగితే పంజాబ్‌, హరియాణా, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌, చండీగఢ్‌లలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఒకేరకంగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ధరలతో పోలిస్తే మరి కొన్ని రోజుల్లో ఉత్తర భారతంలో ఈ ధరలు మరి కొంత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.

పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్రాల వ్యాట్‌తో పాటు కేంద్రం కూడా పన్ను విధిస్తోంది. దీంతో వీటి ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటున్నాయి. జీఎస్టీలో పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీలో చేర్చినా ప్రయోజనం ఉండదు. జీఎస్టీలో ఇరవై ఎనిమిది శాతం స్లాట్‌ లో పెట్టి.. పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెస్‌లు వేస్తే వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. జీఎస్టీలో పెట్రోల్, డీజిల్ ను చేర్చి ఏమీ సెస్‌లు వేయకపోతే.. రూ. 17 నుంచి ఇరవై వరకూ తగ్గుతుంది. అసలు పెట్రోల్ రేటు కన్నా పన్నులు ఎక్కువ ఉండటం వల్లే సమస్య వస్తోంది.
8

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news