Gossipsదేవదాస్ సెట్లో నే మందు కొట్టిన నాగ్..!

దేవదాస్ సెట్లో నే మందు కొట్టిన నాగ్..!

నాగార్జున, నాని కలిసి చేసిన దేవదాస్ మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కలక్షన్స్ ఆశాజనకంగా ఉన్నాయి. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మించారు.

దేవదాస్ లో నాగ్, నానిల హంగామా భలే అనిపిస్తుంది. ఇద్దరు స్నేహితులుగా బాగా కుదిరారు. అయితే సినిమా సెట్ లో నాగార్జున మందు కొట్టారని ఇంటర్వ్యూస్ లో చెప్పడం విశేషం. సినిమాలో తన సీన్స్ అన్ని మందు కొట్టేవే ఉండగా సినిమా ఈవినింగ్ షూట్స్ లో అలా రెండు సిప్పులేసి షూటింగ్ చేశానని అన్నారు నాగార్జున. ఇక నాగార్జునతో నటించడం గురించి నాని చెబుతూ సినిమా మొదలైన రెండో రోజు నాగ్ సార్ షూటింగ్ లో జాయిన్ అయ్యారని.. మొదటి సీన్ గా నడుచుకుంటూ వస్తుండగా చిత్రయూనిట్ అంతా క్లాప్స్ కొట్టారని అన్నాడు.
1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news