Moviesవిశాల్ కు టైం కలిసి వచ్చింది.. అభిమన్యుడు అదరగొడుతున్నాడు..!

విశాల్ కు టైం కలిసి వచ్చింది.. అభిమన్యుడు అదరగొడుతున్నాడు..!

విశాల్ హీరోగా తమిళ దర్శకుడు మిత్రన్ డైరక్షన్ లో వచ్చిన సినిమా అభిమన్యుడు. తమిళంలో హిట్ అయిన ఇరుంబు తిరై సినిమా డబ్బింగ్ వర్షన్ గా తెలుగులో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. తెలుగులో ఓ మోస్తారుగా క్రేజ్ ఉన్న విశాల్ ఈ సినిమాతో ఇక్కడ హిట్ అందుకున్నాడు. లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయిన 3 సినిమాల్లో అభిమన్యుడు హిట్ సాధించింది. డబ్బింగ్ సినిమాగా కాకుండా ఈ సినిమా స్ట్రైట్ తెలుగు సినిమాలా కలక్షన్స్ సాధిస్తుంది.

3 రోజుల్లో 7.10 కోట్లు వసూళ్లను రాబట్టిన అభిమన్యుడు తెలుగు రెండు రాష్ట్రాల్లో మరో 60 థియేటర్స్ పెంచబోతున్నారట. ఏపి, తెలంగాణాల్లో 600 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మరో 60 థియేటర్స్ పెంచబోతున్నారట. విశాల్ ఈసారి తెలుగులో కూడా మంచి హిట్ కొట్టాడు.

ఈ గురువారం రజిని కాలా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఒకవేళ బాక్సాఫీస్ పై మంచి ప్రభావం చూపించలేకుంటే కచ్చితంగా అభిమన్యుడికి మరో వారం కలిసి వచ్చినట్టే. సూపర్ స్టార్ కాలా రిలీజ్ హంగామా అంతంతమాత్రంగానే ఉంది. ఇది కచ్చితంగా విశాల్ కు కలిసివచ్చే అంశమే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news