Newsమహేష్ న్యూ లుక్ లీక్.. గెడ్డంతో మొదటిసారి సర్ ప్రైజ్..!(వీడియో)

మహేష్ న్యూ లుక్ లీక్.. గెడ్డంతో మొదటిసారి సర్ ప్రైజ్..!(వీడియో)

సూపర్ స్టార్ మహేష్ సినిమా సినిమాకు కొత్త కథలను ఎంచుకుంటున్నాడు. అయితే కథలు మారుతున్నా సరే మహేష్ లుక్ మాత్రం రెగ్యులర్ గా అనిపిస్తుంది. ఈమధ్య వచ్చిన అన్ని సినిమాల్లో మహేష్ లుక్ ఒకేలా ఉందన్న వాదన వినిపించింది. అందుకే ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరక్షన్ లో చేయబోతున్న సినిమా కోసం మహేష్ కొత్త లుక్ ట్రై చేస్తున్నాడట.

ఈసారి మహేష్ పూర్తిస్థాయి మేకోవర్ ఉంటుందని తెలుస్తుంది. గెడ్డం లుక్ తో మహేష్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తాడని తెలుస్తుంది. అయితే మహేష్ గెడ్డం లుక్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఎయిర్ పోర్ట్ లో మహేష్ గెడ్డం లుక్ ఫోటోలు తీసి లీక్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

1 2 3

అతిధి, పోకిరి సినిమాల్లో కాస్త రఫ్ గా కనిపించిన మహేష్ మళ్లీ కొత్త లుక్ ట్రై చేయలేదు. వంశీ పైడిపల్లి సినిమా కోసం గెడ్డంతో కనిపించనున్నాడు. మరి మహేష్ కొత్త లుక్ ఎలా ఉండబోతుందో చూడాలి. అశ్వనిదత్, దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజసం, రైతు బిడ్డ అన్న టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుండగా అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news