Newsభారీ విరాళం సమర్పించిన రాజమౌళి..!

భారీ విరాళం సమర్పించిన రాజమౌళి..!

టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ రాజమౌళి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి లాంటి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి. అంతేకాదు తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచిన దర్శకుడు మన జక్కన్న. ఇక సినిమానే కాదు ఎలాంటి మంచి విషయానికైనా ముందుండే రాజమౌళి అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా స్కూల్ పిల్లలకు మంచి భోజనం అందించేలా 23.75 లక్షలు విరాళం ఇచ్చారట.

ఎంత రెమ్యునరేషన్ కోట్లలో ఉన్నా సాయం చేయాలంటే మంచి మనసు కావాలి. అది రాజమౌళికి ఎక్కువే ఉందని చెప్పొచ్చు. ఈ ఇయర్ మొత్తం మంచి భోజనం అందించేలా అక్షయపాత్ర ఫౌండేషన్ సెలబ్రిటీస్ దగ్గర నుండి కొంత విరాళాలు సేకరిస్తుంది. ఇక కేవలం తను మాత్రమే కాదు తన అభిమానులకు 950 రూపాయలు విరాళంగా ఇవ్వాల్సిందిగా కోరాడు రాజమౌళి. తనతో పాటుగా తన అభిమానులను ఈ మంచి పనిలో భాగం చేయాలని చూస్తున్నాడు రాజమౌళి.

స్కూల్ పిల్లలకు మంచి న్యూట్రీషన్ కలిగిన ఫుడ్ అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ ఈ విరాళాలను సేకరిస్తుంది. సంవత్సరం మొత్తానికి సరిపడా ఫుడ్ కు కావాల్సిన విరాళాలు సేకరిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news