Gossipsమెగా ఫ్యామిలీ లో విబేధాలు..!

మెగా ఫ్యామిలీ లో విబేధాలు..!

మెగా ఫ్యామిలీ నుండి కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమా ఎనౌన్స్ మెంట్ నుండి మెగాస్టార్ చిరంజీవి మాత్రమే ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. టీజర్ టైంలో మెగా హీరోలెవరు స్పందించలేదు. అప్పుడు బిజీ అనుకున్నా కచ్చితంగా విజేత ఆడియోకి అందరు వస్తారని భావించారు. తీరా చూస్తే చిరు ఒక్కడే వచ్చి కార్యక్రమం ముగించేశాడు.

ఇక ట్రైలర్ టైంలో కూడా ఏ ఒక్క మెగా హీరో సినిమా గురించి కాని, కళ్యాణ్ దేవ్ గురించి కాని ప్రస్థావించలేదు. సపోర్ట్ గా ఓ ట్వీట్ కూడా చేయలేదు. దీనికి కారణం ఆడియో ఈవెంట్ కు చిత్రయూనిట్ నుండి కాకుండా జాతీయ మెగా అభిమాన సంఘం ప్రతినిధుల ద్వారా మిగతా మెగా హీరోలకు ఆహ్వానం పంపారట. దాని వల్లే హర్ట్ అయ్యి విజేత ఆడియోకి రాలేదని అంటున్నారు.

ఏది ఎలా ఉన్నా మెగా హీరోల జాబితాలో కళ్యాణ్ దేవ్ కూడా వచ్చేస్తున్నాడు. రాకేష్ శషి డైరక్షన్ లో వస్తున్న విజేత సినిమాను సాయి కొర్రపాటి నిర్మించగా జూలై 12న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news