Gossipsఅరవింద సమేత మోషన్ పోస్టర్.. ఫేవరిజం అంటే నందమూరి ఫ్యాన్స్ దే..!

అరవింద సమేత మోషన్ పోస్టర్.. ఫేవరిజం అంటే నందమూరి ఫ్యాన్స్ దే..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా మళ్లీ తారక్ మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే కత్తి పట్టి బాక్సాఫీస్ పై వసూళ్ల హంగామా సృష్టించడం ఖాయమని చెప్పిన తారక్ సినిమాతో ఎన్నాళ్ల నుండో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న మాస్ మసాల మూవీ అందిస్తాడని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా నుండి ఓ ఫ్యాన్ మేడ్ మోషన్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఎప్పటిదో తారక్ ఫోటోని కాస్త అటు ఇటుగా మార్చి ఈ మోషన్ పోస్టర్ డిజైన్ చేశారు. అరవింద సమేత వీర రాఘవ ఈ సినిమా గురించి ఏ చిన్న వార్త అయినా ఇప్పుడు సంచలనం అవుతుంది.

ఫేవరిజం అంటే ఇదే అన్నట్టుగా అరవింద సమేత వీర రాఘవ కోసం ఫ్యాన్ మేడ్ పోస్టర్ పై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఈ పోస్టర్ చూసేందుకు ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. అఫిషియల్ మోషన్ పోస్టర్ వచ్చేదాకా ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ మాత్రం అందరిని అలరిస్తుంది.

https://youtu.be/tRN1sZGLdu8

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news