Gossipsనా సినిమా పోయే.. పోయే..

నా సినిమా పోయే.. పోయే..

నాచురల్ స్టార్ నాని తన సహజ నటనే కాదు స్టార్ ఇమేజ్ ఉన్నా గొప్పలు పోని హీరో. ప్రస్తుతం ఉన్న టైంలో సినిమా ఆడినా ఆడకున్నా తమ సినిమ సూపర్ హిట్ అని డప్పుకునే ఈరోజుల్లో నాని మాత్రం తన లేటెస్ట్ సినిమా కృష్ణార్జున యుద్ధం ఆడలేదని ఒప్పుకున్నాడు. వరుస విజయాలతో నాని ఫాం కు బ్రేక్ వేసిన కృష్ణార్జున యుద్ధం యుప్ టివిలో ఫుల్ మూవీ ఎవైలబుల్ ఉంది.

ఇక ఆ సినిమా ఆన్ లైన్ రిలీజ్ ఎనౌన్స్ లో భాగంగా యుప్ టివి వారు నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ అని ప్రమోట్ చేస్తున్నారు. ఇక దాన్ని ట్యాగ్ చేస్తూ సూపర్ హిట్ అంత అవ్వలేదు బాబాయ్.. ఆడలేదు కూడా.. అయినా సరే మనసు పెట్టి చేశాం చూసేయండి అంటూ ట్వీట్ చేశాడు.

తన సినిమా ఆన్ లైన్ లో రిలీజ్ అవుతుంది. ఆ సినిమా చూసినా చూడకున్నా తనకు ఏమి రాదు. కాని నాని మాత్రం హిట్ సినిమా అని ప్రమోట్ చేస్తున్న వారిని కూడా తన సినిమా ఆడలేదని ఒప్పుకోవడం గొప్ప విషయం. త్వరలో యుప్ టివిలో స్ట్రీమింగ్ అవుతున్న కృష్ణార్జున యుద్ధం మిని థియేటర్ అదేనండి ఆన్ లైన్ లో ఎలా ఆడుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news