Gossipsకంపోజర్స్ డ్రీమ్.. అరవింద సమేతలో అదిరిపోయే ఈ హంగామా కూడా..!

కంపోజర్స్ డ్రీమ్.. అరవింద సమేతలో అదిరిపోయే ఈ హంగామా కూడా..!

త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా క్రేజీ కాంబినేషన్స్ ను సెట్ చేస్తుంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యంతో త్రివిక్రం డైరక్షన్ లో ఓ పాట కంపోజ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ పాటని ఎవరు పాడుతున్నారో తెలుసా ఇంకెవరు మన తారక రాముడే.. నటనతో పాటు అప్పుడప్పుడు తన గాత్రాన్ని కూడా సరిచేసుకుంటాడు.

ఈ క్రమంలో తమన్ కంపోజింగ్ లో అరవింద సమేత కోసం ఓ పాట పాడుతున్నాడట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఈషా రెబ్బ కూడా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. తమన్ కంపోజింగ్ లో తారక్ పాట ఎలా ఉంటుందో చూడాలి. డైలాగ్ చెబితేనే థియేటర్ దద్దలిల్లేలా చేసే ఎన్.టి.ఆర్ ఇక పాటతో ఎలా అలరిస్తాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news