Gossipsరాజమౌళి సినెమా RRR కాదు ... 'RRRR'.. విలన్ గా మరో...

రాజమౌళి సినెమా RRR కాదు … ‘RRRR’.. విలన్ గా మరో స్టార్ హీరో ..!

మెగా నందమూరి మల్టీస్టారర్ గా వస్తున్న ఎన్.టి.ఆర్, రాం చరణ్ సినిమాపై ఓ సంచలన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచరిస్తుంది. సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ గా చెబుతూ RRR గా రాజమౌళి వదిలిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేయగా ఇప్పుడు ఆ సినిమాలో విలన్ గా మరో ‘R’ను జత చేస్తున్నారట. RRR మాత్రమే కాదు ఆ విలన్ ‘R’ తో కలిపితే RRRR అని చెప్పాల్సి వస్తుంది.

ఇంతకీ రాజమౌళి, రాం చరణ్, రామారావు అదే ఎన్.టి.ఆర్ లకు సరి తూగే విలన్ ఎవరు అంటే యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ అని తెలుస్తుంది. ఆయన పేరు కూడా ఆర్ తోనే మొదలవుతుంది కాబట్టి ఈ సినిమా మొత్తం R సెంటిమెంట్ తో రాబోతుందని తెలుస్తుంది. ఇక రీసెంట్ గా ఇదో ఫిక్షన్ మూవీగా వస్తుందని అన్నారు. గరుడవేగాతో ఫాం లోకి వచ్చిన రాజశేఖర్ నిజంగానే ఈ సినిమా విలన్ గా చాన్స్ దక్కించుకుంటే ఇక ఆయన కెరియర్ కు తిరుగు ఉండదని చెప్పొచ్చు.

మొన్నటిదాకా స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని అనగా.. సడెన్ గా ఫిక్షన్ కథని చెబుతున్నారు మరి ఈ సినిమా అసలు కథ ఏంటన్నది తెలియాల్సి ఉంది. విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే సినిమా కథను సిద్ధం చేయగా ఫైనల్ వర్క్ జరుగుతుందట. అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ డీటైల్స్ త్వరలోనే వెళ్లడిస్తారని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news