Gossipsఎన్టీఆర్ బయోపిక్ లో మహేష్.. సంచలనానికి అంతా సిద్ధమా..!

ఎన్టీఆర్ బయోపిక్ లో మహేష్.. సంచలనానికి అంతా సిద్ధమా..!

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా నందమూరి బాలకృష్ణ ఎన్.టి.ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తేజ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా రీసెంట్ గా గ్రాండ్ గా ఓపెన్ అయ్యింది. ఇక ఈ సినిమా గురించి ప్రతి అప్డేట్ నందమూరి ఫ్యాన్స్ ను ఉత్సాహ పరుస్తుంది. ముఖ్యంగా సంచలన హీరోయిన్ శ్రీరెడ్డి లైవ్ చాట్ లో ఎన్.టి.ఆర్ బయోపిక్ లో సూపర్ స్టార్ మహేష్ కూడా ఉంటున్నాడన్న న్యూస్ రివీల్ చేసింది.

ఈ విషయంపై అటు నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు ఘట్టమనేని ఫ్యాన్స్ కూడా సర్ ప్రైజ్ అవుతున్నారు. బాలకృష్ణ, మహేష్ అది కూడా ఒకే స్క్రీన్ పై అంటే ఇక ఆ సంచలనానికి తిరుగు ఉండదు. ఎన్.టి.ఆర్ బయోపిక్ లో ఈ అరుదైన కాంబినేషన్ సెట్ అవుతుందట. మరి మహేష్ చేసేది చిన్న రోలా లేదా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది.

మొదటిరోజే దానవీరశూరకర్ణ సినిమాలో దుర్యోధనుడి గెటప్లో అదరగొట్టాడు బాలయ్య బాబు. 2019 సంక్రాంతికి రిలీజ్ అనుకున్న ఈ సినిమాను దసరా కల్లా ప్రేక్షకుల ముందుకు తెస్తామని డైరక్టర్ తేజ రివీల్ చేయడం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news