Gossipsనటుడు.. ఆ సాహసం చేయగలవాడు తారక రాముడొక్కడే.. రాజమౌళి సినిమాలో... 'R'అలియాస్...

నటుడు.. ఆ సాహసం చేయగలవాడు తారక రాముడొక్కడే.. రాజమౌళి సినిమాలో… ‘R’అలియాస్ రామారావు..!

బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా తీయాలన్న తర్జన బర్జనలో ఉండగా రేర్ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ సెట్ చేస్తే పోలా అన్న ఐడియా వచ్చింది. ఆలోచన వచ్చిందే మొదలు తనకు ఇష్టమైన తారక్, తన డైరక్షన్ లో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన చరణ్ ను పిలిచి కథ చర్చించాడు. రాజమౌళి సినిమా అంటే కాదంటారా చెప్పండి.. అది కూడా బాహుబలి లాంటి సినిమా తర్వాత కాబట్టి వెంటనే ఊ కొట్టేశారు.

ఇక అక్కడ మొదలైంది ఓ ప్రస్థానం.. ఏళ్ల తరబడి సోలో హీరోలదే చరిత్ర అంటూ ఎవరికి వారు మా సినిమా రికార్డులే గొప్ప అని చంకలు గుద్దుకుంటున్న వేళ మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమా ఎనౌన్స్ చేశాడు రాజమౌళి. ఓ పక్క రికార్డుల ఊచకోతతో యంగ్ టైగర్.. మరో పక్క మెగా ప్రస్థానం మోస్తున్న మెగా పవర్ స్టార్ ఇద్దరు కలిసి రాజమౌళి మల్టీస్టారర్ లో ప్లేస్ సంపాదించారు.

ఇక ఈ సినిమా కథలో ఓ హీరో నెగటివ్ షేడ్స్ ఉంటాయట. అది ఎవరై ఉంటారా అన్న చర్చ మొదలైంది. రంగస్థలం ముందు దాకా చరణ్ ఓ కమర్షియల్ హీరో కాని రంగస్థలంతో నట చరిష్మా చూపించి సత్తా చాటాడు. ఇక సినిమాలో నెగటివ్ షేడ్స్ అయితే ఎన్.టి.ఆర్ కే ఉంటాయని ఫిల్మ్ నగర్ టాక్. హీరోగా నెగటివ్ షేడ్స్ లో నటించడం మాములు విషయం కాదు.. ఆల్రెడీ ఎన్.టి.ఆర్ జై లవ కుశలో అది చేసి చూపించాడు. ఇప్పుడు మళ్లీ అలానే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎన్.టి.ఆర్ కనిపిస్తాడట.

రాజమౌళి ఈ పాత్రను కొత్తగా ట్రీట్ చేస్తున్నాడట. నటుడు కాబట్టి ఎన్.టి.ఆర్ ఏం చేసినా అది ఫ్యాన్స్ కు హ్యాపీనే. అయితే మల్టీస్టారర్ కాబట్టి మెగా హీరోకి తగ్గకూడదు అన్న భావన ఉంటుంది. మరి జక్కన్న ఆలోచన ఏమో కాని విలన్ గా నటించే ఆ ‘R’ఎవరో కాదు ఎన్.టి.ఆర్ అలియాస్ రామారావు అని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో కొద్దిరోజులు ఆగితే తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news