Moviesసైరా నరసింహారెడ్డి.. మోషన్ పోస్టర్ లో వాయిస్ ఎవరిదో తెలుసా..?

సైరా నరసింహారెడ్డి.. మోషన్ పోస్టర్ లో వాయిస్ ఎవరిదో తెలుసా..?

చిరు 151 సంచలనాలు అప్పుడే మొదలయ్యాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ తో వస్తున్న మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి మోషన్ పోస్టర్ తో ఫ్యాన్స్ కు తిరుగులేని కానుక ఇచ్చాడు. ఇక మోషన్ పోస్టర్ మ్యూజిక్ థమన్ అదరగొట్టగా చివర్లో వచ్చిన సైరా నరసింహారెడ్డి అన్న వాయిస్ అందరికి హుశారొచ్చేలా చేసింది.

మోషన్ పోస్టర్ లో వచ్చిన ఆ వాయిస్ ఎవరిది అని ఊహించడం మొదలు పెట్టారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా చెబుతున్న ఆ వాయిస్ పరుచూరి గోపాలకృష్ణదని అంటున్నారు. ఇది కచ్చితంగా ఆయన వాయిస్ అని చాలామంది డిక్లేర్ చేస్తున్నారు. అఫిషియల్ గా మాత్రం అది ఎవరి వాయిస్ అన్నది తెలియలేదు.

సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు పరుచూరి సోదరులు కథ అందించడం జరిగింది. ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాపై మోషన్ పోస్టర్ తోనే అంచనాలు పెంచేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news