Moviesగుడ్ న్యూస్ ఫర్ పవర్ స్టార్ ఫ్యాన్స్.. పండుగ చేసుకోవడం ఖాయం..!

గుడ్ న్యూస్ ఫర్ పవర్ స్టార్ ఫ్యాన్స్.. పండుగ చేసుకోవడం ఖాయం..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కచ్చితంగా పండుగ చేసుకునే వార్త ఇది.. 2019 ఎన్నికల బిజీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం అవుతాడని ఎన్నాళ్ల నుండో వినిపిస్తున్న మాట. ప్రస్తుతం చేస్తున్న త్రివిక్రం సినిమా పూర్తి కాగానే అసలైతే సినిమాలకు ఫుల్ స్టాప్ లేదా కామా అయినా పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడు పవన్ కళ్యాణ్.

అయితే సన్నిహితుల సలహా మేరకు పవన్ ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాడని టాక్. 2019 ఎన్నికల ముందు నెల దాకా సినిమాలను కూడా సరి సమానంగా చేయాలని పవన్ సరికొత్త డెశిషన్ తీసుకున్నాడట. పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఈ న్యూస్ వారికి కొత్త జోష్ ఇస్తుంది. ఓ పక్క జనసేన పార్టీ విదివిధానాలతో బిజీగా ఉంటూనే మరో పక్క సినిమాలను చేసేలా షెడ్యూల్ చేస్తున్నాడట పవన్ కళ్యాణ్.

త్రివిక్రం సినిమా పూర్తి కాగానే సంతోష్ శ్రీనివాస్ తో తమిళ రీమేక్ మూవీ చేయబోతున్నాడు పవన్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆ సినిమా పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news