Moviesఅక్కడ ఆడియో ఇక్కడ ప్రీ రిలీజ్.. మహేష్ ప్లాన్ అదుర్స్..!

అక్కడ ఆడియో ఇక్కడ ప్రీ రిలీజ్.. మహేష్ ప్లాన్ అదుర్స్..!

మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పైడర్ తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మహేష్ తమిళ మార్కెట్ పై తన ప్రభావం చూపించాని చూస్తున్నాడు. అందుకే అక్కడ సినిమా ప్రమోషన్స్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 9న చెన్నైలో స్పైడర్ గ్రాండ్ ఈవెంట్ జరుగనుంది. మహేష్ ను తమిళ పరిశ్రమకు పరిచయం చేస్తూ ఈ వేడుక జరుగనుంది.

ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ రజినికాంత్, శంకర్ లు చీఫ్ గెస్టులుగా వస్తారని తెలుస్తుంది. ఇక అదే వేడుకలో ఆడియోని కూడా రిలీజ్ చేస్తారట. అయితే ఇక్కడ మాత్రం అదే రోజున తెలుగు ఆడియోని డైరెక్ట్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఇక్కడ ఫ్యాన్స్ కోసం సెప్టెంబర్ 16, 17న భారీ రేంజ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. సినిమా ట్రైలర్ కూడా అదే రోజు రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న మహేష్ స్పైడర్ మూవీ తెలుగు తమిళ భాషల్లో భారీగా రిలీజ్ అవుతుంది. బాహుబలి తర్వాత సౌత్ నుండి అంతటి క్రేజీ మూవీగా రాబోతున్న ఈ మూవీపై అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో జరుగుతుంది. మరి సినిమా వసూళ్లు ఎలా ఉంటాయన్నది వస్తేనే కాని చెప్పలేం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news