Moviesటాప్ హీరోయిన్ 23 ఏళ్ల కుర్రాడితో కమిట్ అయ్యింది.. ఏంటి ఈ...

టాప్ హీరోయిన్ 23 ఏళ్ల కుర్రాడితో కమిట్ అయ్యింది.. ఏంటి ఈ కథ..!

దశాబ్ధం పైగా తెలుగు పరిశ్రమలో హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉన్న శ్రీయా శరణ్ మళ్లీ తన కెరియర్ లో క్రేజ్ సంపాదించుకుందని చెప్పొచ్చు. 30 పై బడిన భామలంతా కెరియర్ దాదాపు సర్ధేసినట్టే అనిపించినా వచ్చిన చిన్నా చితకా ఛాన్స్ లను వాడుకుంటూ మళ్లీ క్రేజ్ సంపాదించేస్తున్నారు. వారిలో శ్రీయా కూడా ఒకరని చెప్పొచ్చు.

బాలయ్య నటించిన శాతకర్ణిలో వశిష్టదేవిగా నటించిన శ్రీయ అదే బాలయ్య చేసిన పైసా వసూల్ లో కూడా ఛాన్స్ పట్టేసింది. ఇక ఇప్పుడు మరో 23 ఏళ్ల కుర్రాడు చెప్పిన కథకు ఫ్లాట్ అయ్యిందట శ్రీయ. తనకన్నా వయసులో, అనుభవం లో చిన్న వాడైనా సరే ఆ కుర్రాడు చెప్పిన కథకు శ్రీయ సర్ ప్రైజ్ అయ్యిందట. మొదటిసారి కెరియర్ లో హర్రర్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్న తనకు ఈ సినిమా మంచి మేకోవర్ అని అంటుంది.

మరి శ్రీయను ఇంతలా ఇంప్రెస్ చేసేలా ఆ కుర్ర డైరక్టర్ ఏం చెప్పాడో ఏమో కాని శ్రీయ మాత్రం తన తర్వాత సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉంది. ఇక బాలయ్యతో మూడు సినిమాలు చేసిన శ్రీయ తన ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది. సీనియర్ హీరో అయినా సరే సెట్స్ లో బాలయ్య చేసే అల్లరికి అందరు షాక్ అవుతారని.. బాలకృష్ణతో వరుసగా రెండు సినిమాలు చేయడం తన లక్ అని అంటుంది శ్రీయ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news